పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

187


స్త్రీలంటూ గాన విద్యాపరిశ్రమ కలవారు వున్నట్టు హరిశ్చంద్రోపాఖ్యానంలో కనపడుతుంది. ఆలాటివాళ్లేవరు ఆ మాన్యాలు పుచ్చుకొని ఆ దేవుఁడి నౌకరీకి సిద్ధపడుదురేమో? యిప్పుడు గాంధీగారి యేర్పాటుప్రకారం వాళ్లకు దేవాలయప్రవేశానికి ప్రవేశమున్నట్టుకూడా కనపడదుగదా! లేదా ఆభూములు మఱివకసత్కార్యానికి దేవాలయ ధర్మకర్తలు వినియోగించుకుంటారు. వీరికెందుకు? యిప్పుడు వితంతువివాహం చేసుకొనే కన్యకకు పూర్వ భర్త తాలూకు ఆస్తియందు వుండే హక్కు పోcగూడదనే శాసనానికి కొందఱు దయాళువులు ప్రయత్నిస్తూ వున్నట్టు వినడం. ప్రస్తుత విషయంకూడా అట్టిదే. దీన్ని గురించి యెవరుగాని, యేదిగాని వ్రాయకూడదు. వ్రాస్తే మాటదక్కదు– “బుధ జన ఇవ గ్రామ్యసదసి." ప్రధానవిషయాన్ని వదలిపెట్టి యేవో తోఁచిన మాటలతో దూషించి వ్రాయడానికి యేతపస్వినేనా మొదలుపెడుతుంది. ఆవిడకు జవాబు వ్రాయక వూరుకుంటే వకచిక్కువ్రాస్తే వక చిక్కు అందుచేత ఆవిణ్ణి యిలా ప్రార్ధిస్తే బాగుంటుందను కుంటాను- “అమ్మా! నేను జనరల్‌గా కళలనుగూర్చి యెవరికి అధికారంవుందో వారిని గూర్చిన్నీ దేవాలయ మాన్యాలు వృథాగా అయిపోవడాన్ని గుఱించిన్నీ వ్రాశానుగాని ఆయా విద్యలు వేశ్యలు వదులుకోవద్దనిగాని. వదులుకోవద్దని యెవరేనా బోధించవలసిందనిగాని వ్రాయలేదు. యెన్నో సంగతులు పూర్వకాలంలో వుండేవి వ్రాసి నా వ్యాసంలో చర్చించి వున్నాను. నీవు వాట్లను స్పృశించనేలేదు. వక్క మాన్యాలను గూర్చిన్నీ, కళలను గూర్చిన్నీ మాత్రమే యెత్తుకున్నావు. వాట్లను గూర్చి నేను నాస్వీయాభిప్రాయాన్ని లేశమున్నూ వ్రాయలేదు. పూర్వుల అభిప్రాయాన్ని నేను అనువదించానుగాని అందులో నా అభిప్రాయము లేశమున్నూలేదు. నన్ను వుపసంహరించుకొమ్మన్నావు నీవు నన్ను దూషిస్తావనే భయంచేత వుపసంహరించుకున్నానే అనుకో? ప్రాచీన గ్రంథాలని యేంచేస్తావు?పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు పోతాయా? అందుచేత వొకవుపాయం చేస్తే బాగుంటుంది. లీగల్‌గా వొక నోటీసు యిప్పిస్తివా, వెంటనే దానిమీఁద వ్యాసం వుపసంహరించుకోవడమేకాదు, క్షమాపణే ప్రచురిస్తాను. కొందఱు యీమధ్య యిలాటి విషయాలకు వుపవాస దీక్షలు ప్రారంభిస్తూవున్నారు. అవికూడా పనిచేస్తూనే వున్నాయి. యీ మధ్య వక స్వాములవారు యేదో ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాన్ని పురస్కరించుకొని యేదో పుస్తకం వ్రాస్తే అది యే సంఘంవారికో బాధకంగా కనపడిందనిన్నీ ఆ గ్రంథాన్ని రద్దుపరచవలసిందని గవర్నమెంటు వారికి విన్నపాలంపుకుంటూ వున్నారనిన్నీ పత్రికలలో కనపడుతుంది. ఆయన జగదేకగురువు ఆయన రచనయందు అంతటి గౌరవం వున్నా వుండవచ్చు. కాఁబట్టి ఆసంఘంవారు యత్నించారన్నా బాగుంది. నేను సామాన్యుఁడను, నేను వ్రాసినదానికి నీవంత భయపడనక్కఱలేదు. యెన్నఁడుగాని