పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

186

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


విద్యాభ్యాసాదులు కొనసాగవు కనక వివాహం లేకపోవడం తటస్థించింది. కాని రాజసభలలో విద్వాంసులు వగయిరాలతోపాటు వకస్థానం గౌరవాపాదకంగానేవుంది. పైఁగా దేవాలయాలల్లోను స్థానం వుంది. చాతుర్వర్ణ్యం తరవాత దేవాలయాలల్లో తీర్థప్రసాదా లివ్వడం వుంది. వ్యభిచార దోషం వకటి వుందిగాని అది యితర స్త్రీలకు పరలోకంలో బాధించినట్టు బాధించదని చెప్పవచ్చు. యెందుచేత? అగ్నిసాక్షికంగా వకభర్తకి వివాహితురాలై ఆపె అందుకు తప్పి సంచరించింది కనక దండింపతగ్గ దోషం చేసినట్టయింది- యిక్కడ అట్టిదోషంలేదు. కాని తనకుయేర్పడ్డ ప్రవర్తనలో అన్యథాగా సంచరిస్తే ఈవిడకూడా దండ్యురాలే. వక వేశ్య మూఁడురోజులు వకరితో వుండుట కేర్పరచుకొని ఆ మూఁడురోజులలో ఆయన స్వర్గతుఁడు కాఁగా సహగమనం చేయబోవడం వగయిరా పురాణగాథలవల్ల బహు భర్తృకత్వాన్ని అంగీకరిస్తూ దానిలోకూడా నియతవర్తనంవుంటే పరలోకహానిలేనట్టు తేలుతూవుంది. యిహలోకంలో దేహారోగ్యం చెడగొట్టుకోవడం, యితరులది చెడగొట్టడం అనేది యీలాటిజాతి యేర్పాటుగా లేని డచ్చి దేశాన్నుంచి దేశానికి దిగుమతి అయిన వ్యాధుల పేరులవల్ల తెలుస్తుంది. అసత్యం లేకుండా జరగనివృత్తులు కొన్ని వున్నాయి. అందులో యిది వకటి. యిట్టిదాన్ని అవలంబించికూడా సత్యతత్పరత్వంవుంటే ఆపె కులస్త్రీ, అందులో పరమోత్తమురాండ్రు పొందే సద్గతినే పొందుతుందని పూర్వ గ్రంథాలవల్ల తేలుతుంది. యిప్పుడు ఆ గ్రంథాలయందుఁగాని వాటిని చదువుకొన్నవారియందుఁగాని గౌరవంలేదు. వారు యే మెంబరు పదవికిన్నీ యెన్నడూ ప్రయత్నించే స్వభావం కలవారుగానూ వుండరు; వకరెవరేనా ప్రయత్నించినా వారికి వోట్లూరావు. కాఁబట్టి వారికి సభ్యత్వం లేదు. సభ్యత్వం వున్నవారున్నూ ప్రాజ్ఞులే కాని వారు భారతీయమైన శాస్తాలయందు కృషి చేసినవారుకారు. మాటవరసకి వక సంగతి వ్రాస్తాను. కుక్కలున్నాయనుకోండి. వాట్లని చంపవలసిందని యేభారతీయ విద్యా నిష్ణాతుఁడున్నూ కొంత ఫండు ధర్మబుద్ధితో యేర్పాటుచేయఁడు. యెవరో వకయూరోపియన్ అట్టిధర్మకార్యానికి కొంతఫండు నిలవచేసినట్టువింటాను. మునిసిపాలిటీలలో కుక్కలని చంపించడం అంతా యెఱిఁగిందే. యివన్నీ ధర్మాలుగా వప్పుకొనే సంస్కారులు గానాభినయాలు ప్రధాన జీవనోపాధులుగాఁ బెట్టుకొని ఆ విద్యలు స్వాతంత్ర్యంతో సంబంధించినవవడంచేత అవివాహితలుగా వుండి ఆకారణంచేత వ్యభిచారదోషానికి గుఱికావలసివచ్చిందని వారిని యేవగించుకొంటూ వున్నారు. కొందఱు నవనాగరికులనే కారణంచేత ఆ విద్యలతోపాటు సమస్తమూ వదులుకొనదలఁచుకొని పాటుపడుతూ వున్నారు. సంతోషమే! అట్టిస్థితిలో నౌకరీ చేస్తే అనుభవించతగ్గవిన్నీ పద్ధతిని వదులుకోతగ్గవిన్నీగా వున్న మాన్యాలు వదులుకోకపోవడమే యుక్తంగా వుందా? మాతంగ