పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గృహస్థింటికి గురువులు వచ్చారు. వారికి సప్లయి చేయడంలో బ్రాందికూడా కావాలని జాబితాయిచ్చారు. శిష్యుండికి ఆ వస్తువు సేవించడం బాగున్నట్లు తోcచలేదు. దానిమీద "స్వామీ యిదిమాబోట్లమేసేవించం, మీరు గురువులు, మీరుసేవిస్తే లోకంపాడయిపోదా?” అని వినయంగానే మనవి చేసేటప్పటికి, గురువుగారికి కోపంవచ్చి, నీవు కులగురువునగు నన్ను ధిక్కరించావు కనుక వంశనాశనమయిపోతావు అని శపించారంట. ఆ శాపాన్ని ఆగృహస్థుతల్లివినినొచ్చుకొని "అయ్యా, యెఱంగండు, అజ్ఞాని, "మీమాటకు యెదురు చెప్పకూడదు” అంటూకోపోపశమనంజేసి జాబితాయిప్పించవలసిం దంటే, శాంతించి వంకపూటకు కాబోలును నలుగురైదుగురికి రు.25-0-0లు బిల్లుచేశారంట! గురుశిష్య భావం అంటే ఇట్టిది. అందులో వైష్ణవసంప్రదాయంలో దీనికి మతీ వాడితనం వుంటుంది. యీ రోజుల్లో అన్నిటితోపాటు దీనికిన్నీ వాడి తగ్గింది కాని యేలాగైనా యింకా యుది అక్కడక్కడ మిక్కిలీ అమల్లోనేవుంది.

సామాన్యగృహస్టే అంతోయింతో గురువుగారి అవ్యక్తతకు యెదురు తిరగవలసివచ్చిందే, మండలాధిపతి యెదురుతిరగడంలో ఆశ్చర్య మేముంటుంది? అయితే యిక్కడ అలాటి అవ్యక్త్యత యేమివుంది? మండలాధిపతి శిష్యుండైనప్పడు గురువు వారితాహతు ననుసరించి పాదపూజ యిమ్మని కోరవచ్చునుగదా? అంటే, యీ ఆశకు పరిమితంటూ వుంటుందా? యెంత పీఠాధికారసులైనా సన్యాసులేకదా? అట్టి సన్యాసుల ఆశ గృహస్టులకన్ననూ మించిపోతే యింక సన్యాసంపుచ్చుకోవడమెందుకు? ᏫᏭQᏇᏇhy సందర్భాలు ఆలోచించి చూస్తే గురువులవారి ప్రవృత్తి సమర్థనీయంకాదు. రాజావారో, లక్షయివ్వడానికేకాదు, యెన్నిలక్షలివ్వడానికైనా తాహతు కలవారే అనుకుందాం. తుదకు రాజావారు చేసిన చమత్కారం చూడండి. అట్టే నిదానించారు. దీనికి వుపాయం యిదే అనుకున్నారు. దగ్గరవుండే ప్రధాన నవకరు బొంగు కిష్టమ్మను, కిష్టమ్మా విభూతిసంచీ యిలా తెమ్మన్నారు. గురువుగారు చూస్తూవుండంగానే ద్వాదశోర్ధ్వపుండ్రస్థానాలకు చతుర్వింశతి విభూతి పెండికట్లు ఆదేశంగా ధరించారు. గురువుగారు ఆశ్చర్యపడి, యాభైవేలూ గంగలో గల్పుకున్నాంకదా అనిలోలోపల అనుకుంటూ వున్నారు. ఆ పట్లాన్ని దిగ్గునలేచారు. స్వామీ అని సగౌరవంగానే గురువుల వారిని సంభావించారు. అయ్యా, నా పేరెవరో తమకు తెలుసునా? అన్నారు. గంగాధర రామారావు; యీ పేరునుబట్టి నాకు తిరుమణితిరుచూర్ణధారణ కెంత ఆవశ్యకత వుందో విభూతి రుద్రాక్ష ధారణకున్నూ అంతే అధికారంవుంది. ఆజ్ఞతీసుకుంటున్నాను, శిష్యుని యందు దయవుంచండి, అనిలేచి కోటలోకి దయచేసినట్లు ప్రత్యక్షంగా చూచినవారు చెప్పగా నే విని వున్నాను.