పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174



కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రలుగా వుండాలి

“వేలంవెఱ్ఱిగా" యీ యిరవయ్యోశతాబ్దంలో ఆయా జాతులు తమతమ జాత్యౌన్నత్యాన్ని గూర్చి మిక్కిలిగా కృషి చేస్తూవున్నాయి. ఆ కృషికి కొందఱికి యే అభ్యంతరాలున్నూ లేవుగాని కొందఱికి కులవృత్తులకు సంబంధించిన స్థిరరూపకమైన ఆస్తులు అడ్డుతగలడమంటూ వకచిక్కు యేర్పడింది.

దాన్ని యేదో విధంగా తొలగించడానికి కొంత ప్రయత్నించడం జరిగింది. అలా జరగడానిక్కారణం అది నోరులేని దేవుఁడికి సంబంధించిన దగుటచేతనున్నూ ఆ దేవుణ్ణి నమ్మివుండే ప్రాచీనాచారపరాయణులు నోరున్న వాళ్లైనా వాళ్లకు సంఘబలం లేకపోవుటచేతనున్నూ ప్రస్తుత స్థితిగతులనుబట్టే కాక యీ యుగమందు “సంఘీశక్తిఃకలౌ యుగే" అను అభియుక్తోక్తి ప్రకారము నడుస్తూవుండడం చేతనున్నూ ప్రతీ వ్యక్తికీ పూర్వులన్నా వారికట్టుఁబాట్లన్నా బొత్తిగా నిస్సాకారంగా చూడడం సామాన్యమై పోయింది. పూర్వం వర్ణాశ్రమాచారాలకూ, ప్రభుత్వానికీ సంబంధంవున్నట్టు యిప్పడు లేదుకదా! దానికితోడు పత్రికలన్నీ వారి అభిప్రాయాన్నే పురస్కరించి యేవ్యక్తి యేవ్యక్తిని యెంత తూలనాడినా అది పూర్వులకు సంబంధించిందైతే సమ్మతించి ప్రచురించడమున్నూ, నవీనులకు సంబంధించిందైతే దాన్ని “బుట్టదాఖలు” చేయడమున్నూ తటస్థించింది. పూర్వుల అభిప్రాయాలను ఆమోదించే పత్రికలంటూ లేనేలేవు. వుంటే అవి తగ్గంత ప్రచారం కలవిగాలేవు. అదిన్నీకాక పూర్వాచారపరాయణు లందఱూ వారి కర్మాన్ననుసరించి వారు వర్తిద్దామనే వారే కాని యితరుల వాదాలతో ప్రసక్తి పెట్టుకోవడానికి అంగీకరించే వారుగా లేరు. యెవరో యేవో కొంచెంగా వ్రాస్తూ వుంటారే అని కొందఱనవచ్చును. ఆ వ్రాసేవారు.సామాన్యులుకాని పెద్ద పెద్దలు కారు. వారు అదృష్టవశంచేత రంగస్థలంలోకి అవతరించడం లేదు గాని అవతరించడమంటూ వస్తే వారి మాటలు యెవరిదాcకానో యెందుకు? వారి వారి సంతానంకూడా యీ రోజుల్లో ఆదరించే స్థితిలోలేదు. అందుకే వారు వూరుకున్నారుగాని చేతకాక కాదు. శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారు మొదలైనవారు కొంతవఱకు యేదో విషయంలో కలిగించుకున్నవారున్నారు. వారి ధర్మోపదేశానికి తగినంత