పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కోపంవచ్చి బాగా చిన్నతనంలో అంటే రాజ్యాధికారం వహించినపిమ్మటే యీ మహోత్సవం జరిగించి తరువాత పస్తాయించికొని వారిలోవారే కనక వక యుక్తిచేసి అది లోలోపలే మాసిపోయేటట్టు చేసుకున్నారని వినికి. యేమిటంటే ఆ యుక్తి- నాయనమ్మగారే కనక, మళ్లా ఆవిడ దర్శనానికి వెళ్లి నమస్కారంచేసి, నేను యీ పని యెందులకు చేయవలసి వచ్చిందంటే, సుమారు 5, 6 నెలలనాండు మీకు మిక్కిలి జబ్బుచేసింది. ఆ సంగతి తమ చిత్తానికి విశదమే. ఆ సందర్భంలో మీరు బ్రతుకరనే సంశయం నాకు తోఁచి, వున్న యీ కాస్త పెద్ద దిక్కున్నూ లేకుండా చేస్తాడేమో భగవంతుడని దిగులుతోంచి “కలౌవేంకటనాయక" అని వుండడం చేత శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారికి నాలో నేనే మీరు నింపాదిగావుంటే “యిలా జరిగింపచేస్తా" నని మొక్కుకున్నాను. కాని యిటీవల యీ మాట మీతో మనవిచేస్తే మీరు సుతరామున్నూ అంగీకరించరని నాకు తెలిసివుండడం వల్ల నైతేనేమి, వకవేళ నాయందువుండే ప్రేమాతిశయంచేత తాము అంగీకరించినప్పటికీ తమకేశపాశం వకమంగలిచేత స్పృశింపఁజేయడానికి దేవతా సాన్నిధ్యంలో అయినప్పటికీ అంతఃపుర మర్యాదకు విరుద్ధంగా వుంటుందని తోcచియేమి, మంచో చెడ్డో నాకీలా తాత్కాలికంగా తట్టి లేనికోపాన్ని తెచ్చుకొని ఆకాస్తా నేనే చేయవలసివచ్చింది. అనేటప్పటికి మనుమడి యుక్తిచమత్కారానికిన్నీ భక్తి తాత్పర్యాలకున్నూ సంతోషించి యొప్పటివలెనే చల్లని దృష్టితోనే ఆదరిస్తూ వుండేవారనిన్నీ పెద్దలవల్ల వినివున్నాను.

యేమైనా, గవర్నమెంటుప్రభుత్వం యింకాబాగా బలపడ్డరోజులు కావకనుక మా రాజావారి ప్రభుత్వం పూర్వపుజమీందార్ల ప్రభుత్వమ్మాదిరిగా నిరంకుశంగానే వెళ్లిపోయిందనడానికి పయిజుట్టుకోంతలు వగయిరా సాక్ష్యమిస్తాయి. జుట్టుకోతపడడమంటే శిరచ్ఛేదం చేయడానికితగ్గ కోపం వస్తేనే జరిగించేవారని తజ్ఞలుచెప్పేవారు. రాజావారి దర్శనానికి వెళ్ళడమంటే పెద్దపులివుండే గుహలోకి వెళ్లడమే అని యెవరిమట్టుకువారే భయపడుతూ వుండేవారట. “తస్మాద్రాజ ముఖం భీష్మం భావుకం" అంటారుకదా? కాని నిరపరాధులను యెవరినిగాని రాజావారికోపం బాధించనేలేదని యిటీవల, అనంగా శ్రీవారి జీవితానంతరం, చెప్పకుంటూ వుండంగా శతథా సహస్రథా వినివున్నాను. అంతకుపూర్వం జమీందార్లకు సివిలు మేజఫ్రేటు అధికారాలు వుండడమున్నూ అప్పడప్పుడే అవి తప్పిపోతూవున్న రోజులవుతూ వుండడముచేత యొవళ్లేనా దివాణం విషయంలో అవిధేయతగా వర్తిస్తే, సామాన్యపు లాకలూకాయ లతోపాటు వారుకూడా మేజస్టేటువద్ద ఫిర్యాదు చేసుకోవడం అనేది నామర్గా అనిపించి రాజావారిట్గా చేసేవారని లోకుల వుత్ర్పేక్ష యిదేనా యీ పిఠాపురపు ప్రభువరేణ్యునకే సాగిందిగాని యింతకన్నా పెద్దసంస్థాన మైనప్పటికీ విజయనగరానికి కూడా సాంగినట్లులేదు. వొక్కొక్క జాతక ప్రభావం వొక్కొక్క