పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారభేదాలు

163


వూరికే పోస్తామనేవారు ఆ సంసారుల ఆడవాళ్లు. ఆ వూళ్లన్నీ యీకఱువు రాకకు పూర్వమే మాఱిపోయాయి. యిప్పుడు చెప్పనే అక్కఱలేదు. కొందఱు రైతు గృహస్థులు రైలుస్టేషనుల దగ్గఱకి తమ నౌకర్లద్వారా మంచి మజ్జిగ దాహానికి పుణ్యంకోసం సమీప స్టేషనులకు పంపడం వుండేది. యివన్నీ యీ యుద్ధపు కఱువుకు పూర్వమే అంతరించాయి. మనకి కఱువంటూ రావడం యే యాభైయేళ్లకో లేక పోలేదుగాని దాని క్కారణం వర్షాభావమే.

పురాణాల్లో ద్వాదశవర్షక్షామాలు వినపడతాయి. గౌతమమహర్షి ఆలాటి క్షామాన్ని గాయత్రీ మంత్రజపం మూలంగా జయించి తన ఆశ్రమాన్ని తంజావూరు సత్రంగా మార్చినట్టు దేవీభాగవతంలో ఉంది. నివారణ యేలాజరిగినా రావడాని క్మారణం వర్షాభావమే. వొకటి రెండేళ్లు పుష్కలంగా వర్షాలు లేక పంట బాగా పండకపోయినా మన మాతృదేశం తన బిడ్డల్ని పోషించుకోగలదుగాని బ్రహ్మరాక్షసిలాగ మన పాలిటికి రైలువచ్చిపట్టుకుంది. అయితే రైలువల్ల యెన్నో సదుపాయాలున్నాయిగదా? అది లేకపోతే బతకడం యెలాగ అంటారేమో? అది లేని రోజుల్లో బతికినవాళ్లే మన తాత ముత్తాతలు. అదేకాదు-తుదకు సిగరెట్లు లేదా సబ్బులు లేదా! టీ, ఇంకా యెక్సెట్రాలు యేవీ లేకపోయినా మన బతుకు పుస్తకాపేక్షే మన తండ్రులలో పలుమంది ఆ రైలు యెఱుగని వాళ్లే యెంత వర్షం కురిసినా యెంత పంట పండినా ఆ బ్రహ్మరాక్షసి యెక్కడికో పట్టుకుపోయి మాయం చేస్తుంది. అందుచేత “సాహెబుకు సవారాజ్యం అబ్బినా బీబికి కుట్టుకాడలే" అనే సామెతకు మనం గుఱికావలసిందే.

పూర్వపు కఱువల్లావొక్క బియ్యానికి మాత్రమే. కట్టుకోవడానికి గుడ్డలు లేవని విన్నట్టులేదు. యింకా అపరాలు లేకపోవడమూలేదు. పాశ్చాత్య నాగరికత బాగా వ్యాప్తిలోకివచ్చి యాభైయేళ్లకంటె ఎక్కువ కాలేదు. క్రమంగా దేశం యేవిధంగా తయారయిందంటే? సర్వత్రా- (1) కాళ్లువున్న కుంటివాళ్లూ, (2) కళ్లువున్న గుడ్డివాళ్లూ యీ విధంగా తయారయింది. సావిట్లోనుంచి వంటయింట్లోకి తిండికి పోవలసివస్తే సైకిలు వుండవలసిందేకదా? అయితే సైకిళ్లు, మోటార్లు వగయిరా యంత్రాలవల్ల వున్న లాభాలు వదిలిపెట్టి యేదో స్వల్పదోషాన్ని బయడపెట్టడము న్యాయమా?- అంటే వినండి!

లాభాలు ప్రత్యక్షంగా కనపడుతూవుంటే నేను లేవనగలనా? లౌకికంగా సంచరించే టీచర్లు వగయిరాలకే కాదు - పల్లెటూళ్లలో పైల కాపర్లుకూడా సైకిలుతోనే నడకసాగిస్తూ వున్నారు. ఆఖరుకర్మ చేయించే పురోహితులు పట్నాలలో దీనిద్వారా యెక్కువలాభం (తహసీల్ దారీ జీతం) పొందుతూన్నారు; యెఱుగుదును. కాని ఆయీ సాధనాలు