పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"యెనీమా"వల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది

161


కనపడడంలేదు. యేవిధంచేత చూచినా సామాన్యగృహస్టుల జీవనం చాలా దుర్భరంగా మాఱడానికి నూతననాగరికత కారణంగా కనపడుతూవుంది. ప్రతివృత్తికీ అడ్డంకికల్గింది. తుదకు క్షౌరంచేసుకొని జీవించే జాతికికూడా అడ్డంకి. అనగా యేదోదానికి విశ్వామిత్ర సృష్టి యేర్పడింది. చిత్రంగా ప్రపంచం మారిపోయింది. ప్రతీదీ మనకి అలవాటయేవఱకూ తేలికధరలో యేర్పడుతుంది. అందులోకి తియ్యనీటి చేపలాగు అలవాటుపడతాం. తరవాత దాని వెల యెంత పెంచినా దాన్ని మనం మానలేం. దీనికి యెన్నో వుదాహరణాలు చూపవచ్చు. పోస్టుకార్డు చూచుకోండి 3 పైసలు మొదటవుండేది. యిపుడు మూడురెట్లు పెరిగింది. తుదకు మూడు రూపాయలదాఁకా పెరిగినా దాన్నిమానలేము. యీ కార్డులు లేనికాలం మనం యెఱుగం. కాని మనతాత ముత్తాతలెఱుగుదురు. వారు తాటాకులతోటే కష్టించి గ్రంథాలు వ్రాసుకొని చదువుకొని మహాపండితులైనారు.

“పుస్తకేషు చ యావిద్యా" అన్న యోగం మనకు పట్టింది. వారి పాండిత్యమో? “వాచోవిధేయం” పైపై మెఱుఁగులు చూచి భ్రమించే వారికి సమాధానం చెప్పలేంగాని ఆ వెనుకటికాలం మళ్లావస్తే చూదామనుకొనే నాబోటి "చేదస్తులు" అక్కడక్కడ యింకా వుండకపోరుగాని ఆ కాలం “భద్రముగలనాటి రోజు లిఁకరా విఁకరా విఁకరావు నెచ్చెలీ!”

మ. అనుమానింపక కల్పనారుచులపై నాసల్ పిసాళించు నెమ్మనమున్.

త్రిప్పుట పెద్దపెద్దలకే వశముకాదు. అట్టిస్థితిలో సామాన్యులను గూర్చి చెప్పేదేమిటి. యేదో “సినీమాను” గూర్చి వ్రాస్తూ చాలాదూరం వచ్చాం, యెందుచేతో యిది నన్ను ఆకర్షించిందికాదు. కారణం గోచరించలేదు. బహుశః వార్ధక్యమే అనుకుంటాను.

క. కూరిమి విరిగిన సతిపై
   నేరమి దోcచుగతి విషయ నిస్పృహమతి యై
   కోరిక లుడిగినవానికి
   నూరక విశ్వమ్ముపైని నొల్లమి వుట్టున్?
                 (కవికర్ణరసాయనము) - స్వస్తి


★ ★ ★