పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"యెనీమా"వల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది

159


తగులుకోనేలేదు. మా చిరంజీవులు అప్పడప్పుడు దీని ప్రాశస్త్యాన్ని గూర్చి ప్రసంగించి ప్రశంసిస్తూంటారు. అయినాసరే నా ಬುದ್ಧಿ మామూలుగానే వుంది. యిది పలువురు స్త్రీలకు (ఆటపాటల నేర్పున్నవారికన్న మాట) పురుషులకు విపరీతంగా ధనం పంచిపెడుతూవుంది. యెందఱో దీనివల్ల లాభం పొందుతూ వున్నారు. యింతవఱకు దీన్ని యెవరుగాని కాదన్నవారు లేరు. అయినా సరే నా ಬುದ್ದಿ మాఱుపుంతలోనే నడుస్తూవుంది. యీ మధ్య యెవరోచెప్పగా విన్నాను.

మా పట్నంలో యింకో సినీమాహాలు వెలుస్తూవుంది అని. ఆమాట విన్నప్పుడు నాకీ క్రిందివాక్యం యెప్పుడో నలభైయేళ్లకు మున్ను విన్నది కాదుకాదు బుద్ధిరాజు ఈశ్వరప్పగారు ఆనాటిపత్రికలలో హాస్యప్రధానంగా వ్రాసింది జ్ఞప్తికి దగిలింది. ఆవాక్యం యిది.

"వచ్చే వత్సరం మావూళ్లో యింకో కల్లుదుకాణం పెట్టిస్తారట" నా ಬುದ್ದಿ వీట్ల విషయంలో యీ విధంగా వుండడాని కేం కారణమో యింకా విచార్యమే. అంతో యింతో ధనంకూడా ఆయీ సినీమాకారణంగా నాకు వచ్చిందికూడాను. అయినాసరే దీన్ని నామనస్సు ఆమోదించడంలేదు. ఆ యీ విషయంలో యితరులమాట ఆలా వుండగా కవులలోనేనా నాతో యేకీభవించే వారుంటారో వుండరో వోటుకు పెడితే పుస్తకాపేక్ష కనక అందుకు సాహసించేదిలేదు. యీవిషయంలో నాబుద్ధి

"వూరంతా వొకత్రోవా, వులిపికట్ట వొక త్రోవా," అనే సామెతకు ప్రథమోదాహరణంగా నాకే కనపడుతూ వున్నప్పుడు యితరులకు కనపడడంలో ఆశ్చర్యంలేదు. అద్భుత విషయాలలో విచారిస్తే పరమాద్భుతం రేడియో కాని సినీమాకాదు. అర్థంలో అంతగా పోలిక లేకపోయినా శబ్దంలో "యెనీమాకీ" దీనికీ పోలిక కనపడుతుంది. యేలాగంటే! యింటికి తాళంపెట్టి యావన్మందీ దీనికోసం వెడితే దొంగలు ప్రవేశించి యిల్లు గుల్లచేసినట్లు కొన్ని వార్తలు వినవస్తున్నాయి. వొకానొక గృహస్టు కొడుకు ఆ దొంగలింకా ఇల్లు వదిలి వెళ్లకపూర్వమే, వచ్చి వాళ్లతో కలియబడి హతుడైనట్లు కూడా విన్నాను. అయితే రైలుగాని, విమానంగాని, యెక్కియెవరో వాట్లకు ప్రమాదం వచ్చి హతులైనారన్నంతలో ఆ ప్రయాణాలే మానుకుంటారా? కనక అంతమాత్రంచేత యీ విషయంలోకాదర పాత్రం కాకపోదు. దీనివల్ల పుణ్యపురుషుల చరిత్రలేమి, పతివ్రతల చరిత్రలేమి, చదువురాని పామరులకుకూడా సుళువుగా బోధపడతాయి. కాని సుప్రసిద్ధ పురాణగాథలు- “సినీమా కవుల” స్వకపోలకల్పనలవల్ల యేదోవిధంగా మాఱిపోతూ వుండడం శోచనీయం. అది అలా వుంచుదాం. సుమారు అయిదాఱేండ్లనాడు కాంగ్రెసు మంత్రులు- “మద్యపానము”