పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

158"యెనీమా"వల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది

సినీమా పేరు వినబడడం ప్రారంభమై మూడు పుష్కరాలు దాటిందనుకుంటాను. అంతకు పూర్వం యివి లేకపోలేదుగాని "తోలుబొమ్మలు" అనే పేరుతో వున్నాయి. 10 గాని, 5 గాని రూపాయిలిస్తే రామాయణమో? భారతమో? (అంతాకాదు) ప్రధానభాగం వినికి చేసేవారు. వొంటెద్దుబళ్లు తుట్టతుదకు మోటార్లుగా మాఱినట్లే నాగరికత హెచ్చిన కొలదిని ఆ తోలుబొమ్మలు యీ విధంగా - అంటే "సినీమాల"గా మాఱిపోయి లోకానికి ఉపకారమో, అపకారమో చేస్తూన్నాయి. మొట్టమొదట ప్రసిద్ధమైన పట్నాలలో యేవొకటో వుండేది ప్రదర్శించే హాలు; అప్పటికి వట్టిబొమ్మలే కనబడేవి. అభినయంకూడా కనపడేది. వాక్కులేదు. అందుచే యింతగా జనం విరగబడేవారుకారు. చిన్నతనంలో నేను "తోలు బొమ్మలాటలు" చాలా చూచినవాణ్ణి అవడంచేత "అదే యిది" అనే ఉపేక్షా బుద్ధి కలగడంచేత ఆయీ ఆటకు వెళ్లడమందు యిచ్చకలిగిందేకాదు. ఆ స్థితిలో యెవరో బలవంతపెట్టి తీసుకువెళ్లి కూర్చోపెట్టడం జరిగింది. కాని నాకేమోగాని విశేషాదరం కలుగనే లేదు. యీ మహాప్రపంచంలో సర్వులూ భార్యలతో (ఘోషాకూడా త్యజించి) పిల్లలతో పిల్లులతోకూడా (కొందఱు యింటికి తాళం పెట్టికూడా అన్నమాట) వెళ్లిచూచి ఆదరిస్తూవుంటే నా బోటికి దానియందు ఆదరం కలక్కపోతే అది గణనీయంకాదు. కాని అంతోయింతో విద్యాప్రవేశం వున్న నన్ను ఆయీ సినీమా యెందుకు ఆకర్షించలేక పోయిందో? సుంత విచార్యం కాకపోలేదు! దీన్ని యిలా వుంచుదాం. ఆ యీ విషయంలో నేను కనిపెట్టింది కొత్తవిషయం వొకటి వుంది, యెప్పటికప్పుడు యేదో క్రొత్త నాటకం కల్పించడమనేది సామాన్యంకాదు. యిప్పటికి కొన్ని వందలేనా కల్పింపబడి వుంటాయి యీబాపతునాటకాలు. రోజు 1 కి మూడు ఆటలు వేసినా పట్నం 1 కి పది సినీమాశాలలు వున్నా అన్నింటికీ అన్నిఆటలకీ సమృద్ధిగా "ఆడియన్సు" వెడుతూనే వున్నారు. పైగా టికట్టు దొరక్క తిరిగి వచ్చే ప్రజ కనపడడంచేత యీ “సినిమాల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ వుంది. కృష్ణా పత్రిక యెంతో ఆవశ్యకమైన విషయమైతే తప్ప ప్రచురించదని వినడం. ఆయీ విషయం తఱచుగా ఆ పత్రిక ప్రచురించి విమర్శిస్తూ వుంటుంది. అట్టి విచిత్రమైన విషయంలో నాకేమో బుద్ధి