పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

154

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సందర్భాలలో కలవదు- "యెవరికి వారే యమునాతీరే" వీరికి కంచప్పొత్తుకుగాని, మంచపొత్తుకుగాని స్వశాఖేగాని అనుకూలించేది మఱొకటిలేదు. వీరుతప్త చక్రాంకణం అంగీకరించరు. గర్భస్థశిశువుకు చూలాలిగర్భంమీద తిరుమణితో ఆయీ సంస్కారం కొందఱు శిష్టులు నెఱవేర్చడం కలదు. వీరు గర్భవైష్ణవులని శ్రీనివాసస్మృతిలో వుంది. అహమేవ గురుస్తేషాం గర్బవైష్ణవ జన్మనామ్ - శివార్చకులు శివభక్తులే కాని లింగధారణం అంగీకరించరు. ఆదిశైవులమంటారు. అంటే ఆరాధ్యశైవులకంటే ప్రాచీనులైన శైవులన్న మాట. వైఖానసుల వైష్ణవంకూడా వీరి శైవంవంటిదే కాని, ఆదిపదంచేర్చి వారు వ్యవహరించుకోవడంలేదు. వీరికి పొత్తు స్వశాఖీయులతో మాత్రమే. దక్షిణదేశంలో అందులోనూ - చిదంబర క్షేత్రంలో వీరిశాఖ విస్తరించి వుండడమే కాకుండా, వుడ్డూలమైన పండితులుకూడా వున్నట్టు వినికిడి. వీరిని దీక్షితులంటారనిన్నీ వీరి వర్తన ఆపేరుకు తగినట్టుగా వుంటుందనీ చెప్పగావిన్నాను. యీదేశంలోకూడా వీరిలో ఆగమాలు తెలిసిన పండితులు కొందఱువున్నారు. యిక్కడ ఆంధ్రదేశస్థులలో ఉండే అవాంతర బ్రాహ్మణులను గూర్చి సంగ్రహంగా తెల్పినట్లయింది.

సత్యాషాఢశాఖీయులు మిక్కిలి విరళంగా తెలుగుదేశంలో యేలూరుప్రాంతంలో కనపడతారు. అసలు వీరు యేడుగోత్రాలు మాత్రమే వుండేవారనిన్నీ యిటీవల రెండు గోత్రాలవారు నిస్సంతవడంచేత నేడు అయిదుగోత్రాలవారే వున్నారనిన్నీ ఆకారణంచేత వివాహాదులు కష్టసాధ్యం కావలసివచ్చిందనిన్నీ ఆచిక్కు తొలగడానికి తెలగాణ్యశాఖవారిని కోరితేవారు వీరిని కలుపుకొన్నారనిన్నీ వినికిడి మాత్రమేకాదు. నేను స్వయంగా ఆయీ శాఖాద్వితయానికి జరిగిన వివాహం కీ||శే||లు కలువలపల్లి రంగనాథశాస్త్రుల్లుగారింట చూచి వున్నాను. ఆయీ శాఖలో యితర శాఖలో యొక్కడోగాని లేని - 'సప్తార్షేయప్రవరులు' - కూడా వున్నారు. మాలో తి||శాIIకి బాల్యగురువులు కీ||శే||లు శ్రీబూర్ల సుబ్బారాయుడుగారు యీశాఖీయులే. నాశిష్యవర్గంలో ప్రధానులలో వొకడుగా గణింపదగిన చి||మంచావజ్ఝల సీతారామశాస్త్రి యీసత్యాషాఢ శాఖీయుడేకాని, ఇతడు జన్మతః తెలగాణ్యుడై సత్యాషాఢ శాఖవారికి దత్తుడయినాడు. భవతు.

యికనల్లా వెల్నాటిపూజార్లు తప్ప అవాంతర బ్రాహ్మణశాఖలన్నీ అంతో యింతో . (ఆంధ్రదేశంలోని) వ్యాకరించినట్లయింది. యేరాజుల కాలంలోనో యేడుగోత్రాలవారు - వెల్నాట్లు శివార్చన చేయడానికి అంగీకరించి కేటాయింపబడడంచేత తక్కినశాఖవారు , వారితో యౌనసంబంధం మానుకొన్నట్లు కనబడుతుంది. భోజన ప్రతిభోజనాలు (శిష్టులకువినా) యితరశాఖలతో జరుగుతూనేఉన్నాయి. భగవంతుణ్ణి పూజించడం