పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చూపునకూ, భేదం కొంత కనపడితేనే -"అహో పేరూరి దౌర్భాగ్యం వ్యాఖ్యాతా సూపశంకరః" అన్నారని చెప్పుకుందురుగదా! ఆస్వాములవారికి గ్రహాయుర్దాయం కాక యోగాయుర్దాయం పట్టి యిప్పుడు వచ్చిచూస్తే యేమనుకోవలసి వస్తుందో? అనిపిస్తుంది నాకు. ఇది గతజల సేతుబంధనం. ఆంధ్రభ్రాహ్మణులలో సర్వవిధాలా వెల్నాటివారు అగ్రగణ్యులు. పేరూరి ద్రావిళ్లు లేదా పెద్దద్రావిళ్లు యీ "ఈషదసమాప్తౌ కల్పప్రత్యయః ఆయీ ‘కల్ప" తౌల్యాన్ని చెప్పేటప్పుడే ప్రత్యయంగాని, వేదాంగాన్ని చెప్పేటప్పుడు స్వతంత్రశబ్దమే (కల్పశ్చేతి షడంగాని, చూ.) యీచర్య. 'చుం' ను గూర్చి వేఱొకవ్యాసంలో విస్తరించడంచేత స్పృశించి విడుస్తున్నాను. అయితే యీ రెండు శాఖలూ తప్ప యితరశాఖలు యెందుకూ పనికిరానివికావు. వారిలోకూడా లోకోత్తరులైన పండితులు వుండేవారు.

(1) భాగవతుల హరిశాస్త్రుల్లుగారు (2) ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రుల్లుగారు (3) కొవ్వూరు గోపాలశాస్త్రుల్లుగారు (4) శిష్టు కృష్ణమూర్తిగారు (5) ఆణివిళ్ల వేంకటశాస్త్రుల్లు గారు (6) నడివింటి మంగళేశ్వరశాస్త్రుల్లుగారు (7) పుల్లేదక్షిణామూర్తి శాస్త్రుల్లుగారు (8) ఇంద్రగంటి గోపాలశాస్త్రుల్లుగారు (9) మంత్రవాది లక్ష్మీనారాయణశాస్త్రుల్లుగారు.

ఈలా యేకరువు పెట్టవలసివస్తే వందలకొలదిగా పెరుగుతుంది. జాబితా గతించిన వికారివత్సరం చాలామంది పండితులను మాట దక్కించుకుంది గాని, లేని పక్షంలో యింకా యిప్పటిక్కూడా చాలామంది వుండేవారే. ఆ వికారి సంllరంలో సప్తగ్రహకూటం తటస్థించింది. అది దేశానికి అనేకవిధాల అరిష్టాపాదకమని మాపరమ గురువులు, కొవ్వూరులో శాంతికి వుపక్రమించి చాలా పనిచేశారు. వారు ఆ దీక్షలోనే పరమపదించారు

“కలిమానం బొక యైదువేలరుగ నేకత్రస్థ సప్తగ్రహ
 మ్ములకున్ శాంతి యొనర్చుచున్ శ్రమలవమ్మున్ లేకయే బ్రహ్మముం
 గలసెన్ బ్రహ్మగురూత్తముండు దశమీ కంజాప్తవారంబు నా
 ద్య లసత్పక్షము కార్తికమ్మును వికార్యబ్దమ్మునుం గూడగన్"

జాబితాలో వుదహరించిన నామధేయాలన్నీ యితరశాఖల పండితులవే. వెల్నాటిశాఖ విస్తరించి వుండడంచేత వారిలో పండితసంఖ్య కూడా విస్తరించే వుండేది. యితరశాఖా సంఖ్యనుబట్టి పండితసంఖ్య యితరశాఖలలోనూ వుండేదన్నమాట. శాఖలన్నిటిలోనూ మా ఆరామ ద్రావిడశాఖ సంఖ్యలో చాలా తక్కువది. కవులూ, పండితులూ, యజ్ఞకర్తలు కూడా యీశాఖలో చాలా తక్కువేగాని, యజ్ఞకర్తలకూ ఋత్విక్కులకూ వుపకరించే గ్రంథం ఆణివిళ్ల అనేది కాకరపర్తి వాస్తవ్యులు ఆణివిళ్ల వేంకటసోమయాజులుగారు రచించడంచేత ఋత్విక్కులలో వారిపేరు యెఱుగని వారుండరు.