పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

145


నామాంతరమని వినికిడి వుంది. ఆదేశ వాసులు బ్రాహ్మణులు వెల్నాటివారు. అయితే ఆదేశంలో వసించే క్షత్రియాదులుకూడా వెల్నాట్లు కావద్దా? అనే శంక కవకాశం లేకపోదు. ఆశంక యితర నాడులకూ వుంది, “అయం నిరుత్తరః పూర్వః పక్షః" -యేకారణమో? బ్రాహ్మణులకు మాత్రమే ఆయీ పేరు కలిగింది –యింతే యిప్పటికి చెప్పేసమాధానం. వెలనాటి చోడుడు అనేపేరుతో వొకరాజు వున్నట్టు దేనిలోనో చదివిన జ్ఞాపకం. ఆయీ ఆంధ్ర బ్రాహ్మణులలో వుండే యావత్తు అవాంతర శాఖలూ వొక ప్రక్కా వెల్నాటివా రొకప్రక్కా వుండేటట్లు విభజించి తూకం వేస్తే యింకా, వెల్నాటివారే మొగ్గుతారని తోస్తుంది. యీ శాఖ సంఖ్యాబాహుళ్యానికే కాదు, పూర్వం - వేదశాస్త్ర సంపత్తికే" కాదు, ఐశ్వర్యానికే కాదు, అన్నిటికీ ఆంధ్ర బ్రాహ్మణశాఖలలో అగ్రగణ్యంగా కనపడుతుంది ఆఖరికి ఆంధ్ర కవిత్వానిక్కూడా నిన్నమొన్నటి నుంచి యీ శాఖకే, తిరుపతిశాస్త్రిగారివల్ల యెక్కువ గౌరవం కల్గింది. అతనిదే యీ వాక్యం

"వెలనాటివాడ గవితకు వెల నాటిన వాడ" అన్నాడు తిర్పతిశాస్త్రి. ఏదో సందర్భములో, యింకా కొందఱు వీరిలో కవులున్నారు. కాని “నఖలు సర్వోపి వత్సరాజః". అనేకకారణాలవల్ల వెల్నాటివారికి అగ్రతాంబూలం యీవలసి వస్తుంది. ఆ శాఖలో -ఆ-బూ-చే-లు మఱీ సుప్రసిద్దులని గోదావరి జిల్లాలో చెప్పగా వినడం. ఆ అంటే ఆకెళ్లవారు, బూ అంటే బులుసు, చే అంటే చేవలి. యీ యింటి పేర్లవారు వేదశ్రౌతాలలో అందెవేసిన చేతులనిన్నీ వీరు లేని యజ్ఞమంటూ వుండదనీ చెప్పకోగా వినడం. “బులుసులేని యజ్ఞం" “బలుసులేని తద్దినం" అనే లోకోక్తి స్పెషలుగా బులుసువారికే సమన్వయించేది సరేసరి, సర్వత్రాకాదు గాని కోనసీమలో మాత్రం అన్నివిధాలా “పెద్ద ద్రావిళ్లు" వెల్నాట్లకు తీసిపోరని చెప్పకుంటారు. (యీ పెద్ద ద్రావిళ్లకు పేరూరు ద్రావిళ్లు అని నామాంతరం) యివన్నీ గతకాలపు మాటలు. యిటీవల అందఱూ రాజకీయ విద్యలోకి దిగారు. లోగడ, శాస్త్రీ, అవధానీ వగైరాల స్థానాలని రావు పదం ఆక్రమించింది. కాని యిప్పడేనా విత్తనాలు (వేదశాస్తాలకు) కావలసివస్తే ఆ ప్రాంతంలోనే సకృత్తుగా దొరుకుతాయి. పూర్వకాలంలో వేదశాస్తాలకు పేరు పడ్డ కుటుంబాలు కొన్ని రాజకీయ విద్యలో కృషిచేసి దానిలో పేరుప్రతిష్ఠలు గడించడం అభినందనీయమేగాని, కొన్ని కుటుంబాలు కాలమహిమచేత యేదీలేకుండా, శుంఠతావచ్ఛేదకాలుగా తయారవడం శోచనీయం. -

“తేషాం నిందా న కర్తవ్యా యుగరూపాహితే ద్విజాః" యెవరో స్వాములవారు అప్పటికి పూర్వం పుష్కరకాలం నాడు చూచిన చూపునకూ, తాత్కాలికంగా చూచిన