పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సోమరిసత్రాలు

సోమరిసత్రాలు పూర్వం తంజావూరు రాజ్యంలో ఆ కాలపు రాజులు వేసినట్టు వినడం. ఆలా వేయడానిక్కారణం ఆ కాలపు రాజుగారికి యెప్పడో వకనాcడు సోమరితనం కలిగినట్టున్నూ దానివల్ల యెన్నో రాచకార్యాలు చెడిపోయినట్టున్నూ చెప్పకుంటారు.

దానితో రాజుగారికి యేం తోచిందంటే? “సరే! మనబోట్లకు సోమరితనం కలిగితే యెన్నో పనులుచెడ్డాయి. చెడ్డప్పటికీ యీ నష్టాన్ని భరించతగ్గ సామర్ధ్యంకూడా వుందికనక అంత చిక్కులేదనుకుందాం. లోకంలో యెందటో నిఱుపేద లుంటారుగదా! వాళ్లలో యెందటో సోమరులున్నూ వుంటారు. వాళ్లగతి యేమి?"టని ఆదయాళువైన ప్రభువు ఆలోచించి “అట్టివాళ్లను పోషించడం మనకు సుకృతం" అనుకొని మంత్రులతో - "సోమరిపోతులనిమిత్తం కొన్ని సత్రాలు యేర్పాటు చేయవలసిందని ఆజ్ఞాపించి నట్టున్నూ మంత్రులు రాజాజ్ఞచొప్పున అట్టి సత్రాలు యేర్పఱచి నట్టున్నూ, స్విష్టకృతుగా ఆ సత్రాల్లో భోజన సదుపాయం జరుగుతూ వుండడంవల్ల యెందటో ఆ సత్రాల్లోచేరి సుఖిస్తూ కాలక్షేపంచేస్తూ వున్నట్టున్నూ అంతట్టో కొన్నాళ్లకు ఆ రాజుగారికి తాము యేర్పాటు చేసిన సత్రాలు యేలా వున్నాయో చూడాలని బుద్ధి పుట్టినట్లున్నూ ఆలా బుద్ధిపుట్టి మంత్రులతోసహా ఆ సత్రాలను చూడడానికి వెళ్లేటప్పటికి యీ కింది విధంగా కనపడ్డట్టున్నూ చెప్పకుంటారు - యేం జరిగిందంటే? ఆ చుట్టుపట్లనే కాదు; రాజధానికి కొంతదూరంలో వున్న జనం కూడా పిల్లలతో పాపలతో ఆసత్రాల్లోచేరి తింటూవున్నారట! ఆ జనాన్ని చూచేటప్పటికి రాజుగారు పరమాశ్చర్యం కలిగి మంత్రులతో - "యేమీ? మనరాజ్యంలో యింతమంది సోమరిపోతులున్నారా?” అని మంత్రులను అడిగేటప్పటికి ఆ మంత్రులలో వక బుద్ధిశాలి – “అయ్యా! వీళ్లందఱున్నూ నిజమైన సోమరిపోతులుగారు. యిందులో పరీక్షకి నిల్చేవాళ్లు ಏಟ್ಟು మంటే నూటికి వకరో యిద్దతో వుంటారేమో?" అని జవాబు చెప్పాండంట! రాజుగారు ఆ మాట విని “వీళ్లని పరీక్షించటం యేలాగ?” అని ప్రశ్నించారట. సెలవైతే క్షణంలో నేను పరీక్షించి నిజమైన సోమరిపోతులెవరో తేలుస్తానన్నాట్ట! రాజుగారు కానిమ్మన్నారంట! అప్పడు మంత్రి - యీ రీతిగా దండోరా వేయించాట్ట, యేమనంటే? “యింక వొక్క గంటలో యీ సత్రాలన్నీ తగలఁబెట్టం బడతాయి కనక మీరంతా వెంటనే వెళ్లిపోవలసిందోహో" అని ముమ్మాటికీ చాటింపు చేయించేటప్పటికి అది వినీవినడంతోటట్టుగానే డబ్బాడవాలీ, చెంబూ చేంతాడు చేతcబుచ్చుకొని పిల్లా జెల్లాతో