పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిక్షమ దైన్యాపాదకమా?

137


విపరీతార్థం చెప్పకోవడం సహృదయ సమ్మతంకాదు. అసలు గ్రంథకర్త తాత్పర్యాన్నిబట్టి వ్యాఖ్యానం చేసుకోవాలి గాని మనకు అనుకూలించేటట్టు చేసుకొని ధర్మప్రవృత్తిని అధర్మ ప్రవృత్తిగా మార్చుకొని చెడిపోయేవాళ్లనివద్దనేవాళ్లెవరు? అట్టివిపరీత ప్రవర్తనమే కావాలనుకొనే వాళ్లకుశాస్త్రంతో అవసరమే వుండదు కదా! అబద్ధం ఆడాలనుకొనే వాళ్లు ఆడవలసిందేకాని దానికోసం "నా౽నృతంవదేత్" అనేశ్రుతికి, నా = మనుష్యుఁడు అనృతం = అసత్యాన్ని వదేత్ = చెప్పవలసింది అంటూ అపార్థకల్పనకూడా చేసి మఱింత దోషం చేయడం యెందుకు? సర్వథా సత్యంవలెనే శాంతిన్నీ కళ్యాణదాయకమైనది. దాన్ని అవలంబించడం యిహపరసాధకం అని తెలుసుకుందాం. యెప్పడూ శాంతంగానే వుందాం. యెప్పడో అత్యవసరమైన విషయం యేదేనా తారసిస్తే తప్ప అశాంతికవచ ధారణాన్ని యేమఱకుండానే కాలక్షేపం చేద్దాం. భగవంతుణ్ణి సర్వదా శాంతినే ప్రసాదించవలసిందని ప్రార్థించుకుందాం. వుభయలోక సమ్మతంగా జీవించుదాం.

క. "ఈలోకమయగుఁగొందఱ
     కాలోకమకొందఱకు నిహంబునుబరమున్
     మేలగుఁగొందఱ కధిపా!
     యేలోకములేదుసూవె! యిలఁగొందఱకున్”


★ ★ ★