పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

130

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెవరో తప్ప తగినంత అవసరం కలిగేదాఁకా సర్వులూ శాంతంగానే వుంటారు. భారవి మహాకవికూడా భారతా న్ననుసరించే యీ క్రిందివిధంగా శాంతినిగూర్చి వ్రాశాcడు -

శ్లో. “శుచి భూషయతి శ్రుతం వపుః ప్రశమస్తస్య భవత్యలంక్రియా,
     ప్రశమాభరణం పరాక్రమస్స నయాపాదిత సిద్ధిభూషణః"

దీనిలో పరాక్రమాన్ని శాంతికి భూషణంగా భారవిగారు చిత్రించారు కానీ అది రాజనీతికి విరోధించకూడదని వకవిశేషణంద్వారా కనపఱిచారు. దీన్నిబట్టి యిది క్షత్రియ విషయమని స్పష్టమే. యేమైనా అవసరానవసరాలనుబట్టి శాంతి వహించనూవచ్చు, పరిత్యజించనూవచ్చు అని తేల్చినట్లయింది.

మొత్తం మనగ్రంథాలు యెన్ని పరిశీలించినప్పటికీ యీ శాంతి విషయము "ఉదితానుదిత హోమం" వలెనే పాక్షికంగా వుంటుంది కాని సార్వకాలికంగా కనపడదు. పోనీ ఆచరణలోనేనా నిత్యత్వం కనపడుతుందేమో అంటే? అదిన్నీ మృగ్యమే. చ్యవనుఁడంతటి బ్రాహ్మణుఁడు మహాతపస్వి మహావృదు, దేహాభిమానంకూడా వదులుకొన్నవాఁడు యెఱక్క సుకన్య చేసిన అపచారాన్ని సహించక సుకన్యనే కాకుండా ఆమె తల్లిదండ్రులనూ ఇంకా వుండే వారి పరివారాన్నీ కూడా మలమూత్రబద్ధంచేత బాధపడేటట్టు శపించాఁడు కదాఁ! వసిష్ట విశ్వామిత్రాదులనుగూర్చిన యితిహాసాలు కూడా యింతకన్నా అద్ద్వాన్నంగానే వుంటాయి. వాట్లని యిక్కడ వుదాహరించి కథ పెంచడం అనవసరం. వొక్క శమీకుఁడు కాఁబోలును! పరీక్షిత్తుచేసిన అపచారానికి లేశమున్నూ శాంతిని గోలుపోలేదు సరికదా! పైఁగా తన కొడుకు శైశవావస్థలో వుండి చేసిన కార్యానికికూడా చాలా విచారించి “తండ్రీ! యీ అకార్యాన్ని యెందుకు చేశా?” వంటూ చాలా పశ్చాత్తాప పడ్డట్టు భాగవతంవల్ల మనకు అవగత మవుతుంది. యింకా యీలాటి శాంతిపరు లెవరేనా వున్నారేమో? గ్రంథాలు వెదికి చూడాలి. పరీక్షిత్తు చేసిన పని చాలా నీచప్పని. మహారాజకుటుంబంలో, అందులో నున్నూ పరమ ధార్మికులనిపించుకొన్న పాండవుల వంశంలో పుట్టినవాఁడు చేయదగిందికాదు. యింతకూ ఆ ఋషి చేసిన అపచారం లేశమున్నూ కనపడదు. తపస్సమాధిలోవుండికదా తనకు ఆతిథ్యాన్ని యివ్వకపోవడం తటస్థించింది! అట్టి సందర్భంలో మృతసర్పాన్ని తెచ్చి ఆ తపోధనుని మెడకు తగల్చడం మిక్కిలీ కొంటెపని. ఇట్టి పనులు యెవ్వరి పరిపాలనలోనూకూడా జరిగి వుండవేమో? కొన్ని కథలు తులసిమొక్క మొదలైనవాట్లకు సంబంధించినవి మనవాళ్లు చెప్పకుంటూ వుంటారు. ఆ కథలు నిజమే అయితే ప్రస్తుతాన్ని అవి అనుకరిస్తాయి. ఆర్యక్షత్రియుఁడు చేయవలసిన పనికాదు కదా అది! అనార్యుఁడు చేయడానికిఁగాని