పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

128

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

 అన్నిటికీవున్నా నల్లిని పేర్కొనడానిక్కారణము అక్కడ బాగా గోచరిస్తుందనియ్యేవే. కర్మఠులు ఆయీ సూక్ష్మజంతువులనుకూడా బుద్ధిపూర్వకంగా చంపరు కాని అప్రయత్నంగా విధిలేక కొన్ని తమవల్ల చచ్చుట తప్పదని తద్దోష పరిహారానికి యేదో వుపాయం-

"వైశ్వదేవం” లోఁగడ వుదహరించాను. దానిచేవారు 'యదహ్నాత్కురుతుపాపం తదహ్నాత్ర్పతి ముచ్చతే' అని నరకభయవిదూరులై జీవించుచున్నారు. దీనినిబట్టి చూస్తే ఆయీ వైదికమతం యెంతపుణ్యం చేసుకున్నవాళ్లకోగాని సంఘటింపదని చెప్పనక్కరలేదు. కాని అయితే యేం లాభం. ఆయీ మతస్థులుగా జన్మించిన్నీ యే నికృష్ణులూ చేయని పనులుచేసే సంతతినిగని భ్రష్టులమగుచున్నాం గదాయని విచారించవలసి వచ్చింది. ఆయీ విపత్తు యుగదోషం కింద జమకట్టి వూరుకున్నారు ధర్మశాస్త్రకర్తలు. యుగదోషానికి అంగీకరిస్తూ కృతయుగం పుణ్యభూయిష్టమే అయినా క్వాచిత్కంగా అక్కడక్కడ "పాపాత్ములు” వున్నట్టే యీకలిలోకూడా “పుణ్యపురుషులు" వుండే వుండవచ్చునని పురాణవాక్యాలు కనపడుతూన్నాయి. యిది విషయాంతరం. ప్రస్తుతం "అహింస" దీనికి యెంతదగ్గిరలో సంచరిస్తే అంత పుణ్యజన్మ అనడంలో విప్రతిపత్తిలేదు. శాక భక్షకులకు కూడా "హింస" అనివార్యమని కొందఱంటారు. చెట్లకు, లతలకు, వీట్లకు నోరులేదుగాని "సుఖదుఃఖాలు" కలవనే పరిశీలిస్తే తోస్తుంది.

“పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం" అనడంవల్ల , భగవంతుcడు మనకు జీవనోపాధిగా యేర్పఱచిన "అన్నం" ఓషధులవల్లనే నిష్పన్నంకావాలి. అందుచేత అహింస తప్పదనుకోవాలి. అన్నీ హింసలే అయినా వాట్లలో- "తారతమ్యం" వుంటుంది. యేనుగుకూ దోమకూ భేదం పాటించక తప్పదు. “అతిసర్వత్ర వర్జయేత్" తోటకూరవంటిదే గోవూ అని వాదిస్తే లాభంలేదు. తనకు వీలున్నంతలో “అహింసాపరుఁడై" వర్తించేవాండు యేజాతివాఁడైనా ధన్యుఁడు! ధన్యుఁడు! ధన్యుఁడు!

★ ★ ★