పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏది అహింస?

127


అనిన్నీ స్థూలదృష్టులకు గోచరిస్తుంది. కానిఅట్టి అవసరమే కలిగితే 'యిచ్చామాత్రం ప్రభోస్సృష్టిః' కనక ఆ పరమదయాకరుడు అట్టి సదుపాయాన్ని చేయనే లేడా? క్షణంకూడా ఆయీ పనికి ఆయనకు పట్టదు. కనక మాంసభక్షకులు చెప్పేయుక్తి ఆపాతరమణీయమే కాని విమర్శకాని విమర్శనాసహంకాని కాదు. మాంసంతినే వారిలో బహుమంది సమ్మతిలేకుండా తినేవారుగానే వుంటారు. వారివారి గృహావరణలో యీహింస జరగకపోవడంచేత వారికి అంతగా మనస్సు చలింపదు. వేఁటలో ప్రవర్తించే జమీందార్లు వగయిరా దయాశీలురే అయినా “పిల్లికి చెలగాటం" సామెతగా వారి కది హింసగానే తోcచదు. దీని బాధముఖ్యంగా "కసాయీలకు" గోచరిస్తుందనుకోవాలి; కాని వారి కది నిత్యకృత్యంగా యేర్పడడంచేత దుఃఖ జనకం కాదనుకోవాలి. పాపం పంచుకోవలసివస్తే మాత్రం “మాంస భక్షకులకు" హింసకులతోపాటు భాగం తప్పదనే అనుకోవాలి

"చత్వారస్సమభాగినః" నాకు యింకోశంక తోస్తుంది. యేదోవొక ప్రాణికి వేఱొక ప్రాణివల్ల హింస తటస్థిస్తే బోలెఁడు పాపం వస్తుందని నిర్ణయించి దానికై ఎన్నో నరకాలు అనుభవించాలని శాస్త్రకర్తలు వ్రాశారుకదా? నేటి “డిక్టేటర్లు" కారణంగా యెన్నికోట్ల ప్రాణులో హతమవుతూ వున్నారుకదా? ఆయీ కారకులకు సరిపడ్డ నరకాలు యెన్ని కల్పాల కాలంలో సృష్టికర్త నిర్మించగలుగుతాడో పాపం!

అన్నిటికీ ఒకటే జవాబు - 'ఇచ్ఛామాత్రం ప్రభోసృష్టిః' పాపమంటూ భయపడేవానికే భయంగాని అది లేనివానికి భయమేలేదు. -

“నరకేసతి కో దోషో, మరణే సతి కిం భయమ్" వొకఁడేమో వరుసగా యేడు కఱవులు వస్తాయని భయపడుతూ వుంటే వేఱొకఁడు చూచి, వొరేఁ ఆ కఱవులలో మొదటిదానిలోనే మనం నశిస్తే తక్కిన ఆఱింటివల్ల మనకేం భయం కలుగుతుంది, అన్నాఁడని పెద్దలు చెబుతారు. అందుచేత లోకనాశకారకుల శిక్షానిర్ణయాన్ని కూర్చి భగవంతుఁడు భయపడవలసినదే గాని అనుభవించేవాళ్లు లేశమూ భయపడరు.

"కర్మణో గహనాగతిః" అన్నట్టు దేన్ని గుఱించేనా పైపైని చర్చించి వూరుకుంటే తప్ప లోలోపలికి పోయివిచారిస్తే దురవగాహంగానే కనపడుతుంది. “ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే౽ర్జున తిష్ఠతి" అనేమాట తోసివేయతగ్గదికాదు. ఏనుగులో వున్నట్టే దోమలోనో యింకా కింది తరగతి సూక్ష్మజంతువులోనో యీశ్వరసత్తను-

"అణోరణీయాన్ మహతో మహీయాన్" కనక వొప్పితీరాలి. నల్లికి మరణభయం వుందని దానిచేష్టలవల్ల గోచరిస్తుంది. చీమలు వగైరా సూక్ష్మజీవులలో యీభయం