పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మ. భగవంతు డితండంచు స్పష్టపడియెన్ బాహాబల ప్రొఢిచే
నగధారిత్వముచే విశిష్టముని మాన్యత్వమ్ముచే విశ్వరూ
పగతిన్ జూపుటచే ననేకగతులన్ బ్రహ్మాదులర్చించు లో
కగురున్ జిష్ణుని విష్ణునక్కటకటా? గైకోండు వీcడంధుండై

యీ వాక్యం భీష్మునిది. కొన్ని మానవచర్యలు చూచి సామాన్యులు మానవుండే యని భ్రమించుట కవకాశం లేకపోలేదు, ఆ సందర్భాలు ఋషులు చర్చించి తత్వాన్ని అక్కడక్కడ పురాణాలలో నిరూపించి వున్నారు. సత్రాజిత్తు శిశుపాలాదులంబలె ద్వేషికాకున్ననూ తాను కష్టించి ఆర్జించుకొన్న మాణిక్యాన్ని అతఁడు అపహరించాడనే అపోహవల్ల మొట్టమొదట కొంత అవ్యక్తప్రసంగం చేస్తే చేశాండుగాక. తుదకు యథార్థం గోచరించిన ఉత్తర క్షణమందే ఆ దోషనివృత్తిని చేసుకుని పరిశుద్దుండవడంచేత సత్రాజిత్తు యింతగా శ్లాఘ్యండైనాఁడు. లోకంలో యిట్టి నిషధయోగ్యుల సంఖ్య చాలా తక్కువగా వుంటుంది. పూర్వంమాట చెప్పలేంగాని యీ కాలంలో అబద్ధాలాడడానికి అవకాశాలు చాలా యేర్పడ్డాయి. ఆఖరికి అబద్ధమేదో సుబద్ధమేదో? నిర్ణయించడానికి అవకాశమే లేకుండా పోయింది. ఆలాటి చిత్రవిచిత్రమైన రూల్సు బోలెడు ఆవిర్భవించాయి. వీట్లనిగూర్చి మటౌకప్పడు చూచుకుందాం.

సత్రాజిత్తు వంటి సత్పురుషులు యీ కాలంలో తక్కువగా వుంటారని మాత్రం తెలుసుకుందాం. ముఖ్యంగా పిడివాదాలు వాదించే కవులూ, పండితులూ ఆ యీ సత్రాజిత్తు మార్గం తెలుసుకుంటే "పాండిత్య వాదాలు" విస్తరించి పెరగవు. మొదట దేనినేనా తప్పంటా మనుకోండి, అలా అనడం తెలియకపోవడంచేత యెంతటివాఁడికీ అనివార్యమే. తరువాత యే భారతమో! యే రామాయణమో అది తప్ప కాదని బోధిస్తుంది. అంతటితో “ఆ వాదం" వదలుకొని ఉన్న యథార్థాన్ని ప్రకటిస్తే దానితో అది ఆంగిపోతుంది. అప్పడు ఆ పండితులు సత్రాజిత్తువంటి వారవుతారు. తమ తప్పను వొప్పకున్నంతల్లో వచ్చే అగౌరవం లేశమూ వుండదు. ఆయావిషయంలో మనకన్నా పాశ్చాత్యులు శాఘ్యులేమో అని నేననుకుంటాను. ఆ దేశ చరిత్రలు బాగా తెలిసినవారుగాని నా అభిప్రాయాన్ని నిర్ణయించలేరు. ఉత్తములు ప్రతి ఖండంలోనూ వుంటారు.

తేభ్యో మహద్భ్యోనమః

★ ★ ★