పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

సూలదృష్టులేమో యితణ్ణి కృతఘ్నుడంటారు. అది సత్యదూరం. యితఁడు కృతాన్ని లేశమున్నూ మఱచింది లేదు, లేనేలేదు. శిష్యుణ్ణి కాదన్నాడా? లేదుకదా? దుర్యోధనుని తరఫునవుండి యుద్ధంచేస్తూ పాండవులకు తనగుటూ మటూ చెప్పడం యుక్తంకాదని సూలదృష్టులనడం కలదు. కాని సూక్ష్మదృష్ట్యా విచారిస్తే అదిన్నీ యుక్తంగా కనపడదంటాను. వుభయులున్నూ భీష్మునికి బాంధవ్యంలో వొక మాదిరివారే. ప్రవర్తనలో పాండవులు, ప్రేమించతగ్గవారవడంచేత భీష్మునికి పక్షపాతం చూపవలసి వచ్చింది. మొదటినుంచీ ఆ పక్షంలో వుండి తీరా యుద్ధ సమయానికి అక్కడనుంచి తప్పకొనేయెడల యింకోమాదిరి అపయశస్సు వస్తుందికదా? అందుచేత ఆ పక్షాన్నే వుండి యుద్ధం చేయవలసివచ్చింది. అయినా తన శక్తిని లేశమున్నూ దాఁచుకోలేదు. దుర్యోధనుcడికి యిచ్చిన వాగ్దానాలన్నీ నెఱవేర్చాండు. అదిన్నీకాక పదిరోజులు యేకాధ్వరంగా యుద్ధంచేశాఁడు శతవృద్దు. అప్పుడేనా శిఖండిబాధ లేకపోతే అర్జునుండికి సాధ్యంకాకపోవునేమో? యిది యిలా వుంచుదాం. కర్ణుణ్ణి అర్ధరథులలో చేర్చడం భీష్మండికి తీరని కళంకంగా చాలామంది భావిస్తారు. నిజానికి కర్ణుడు అర్జునునికన్న బాహుబలాదుల చేతఁగాని, జన్మచేతఁగాని తీసిపోయేవాఁడు కాండని భారతంలో పలుచోట్ల కనబడుతుంది. ఆ సందర్భం భీష్ముండు యెఱుంగని వాండున్నూ కాండు. కనుకనే నిష్కారణంగా అవమానించినట్లయింది. దీనికి తగినజవాబులేదు. భవితవ్యం యెఱిఁగి వుండడంచేత దుర్యోధనుణ్ణి అనుత్సాహపరిస్తే యుద్ధం ఆంగిపోతుందేమో? దానివల్ల జనక్షయంకావడం తప్పతుందని భీష్ముండలా ప్రవర్తించవలసి వచ్చిందనుకోవాలి. భీష్ముండు కర్ణుణ్ణి యిటీవల తాను శరతల్పగతుండైన ಹಿಮ್ಮಿಲು మాట్లాడే సందర్భంలో యెంతో గౌరవించినట్లున్నూ భారతంలోనే కనపడుతుంది. పైకి యితరులతోపాటుగా భీష్ముండున్నూ కర్ణుణ్ణి సూతపుత్రుండంటూ నిరసించినా అసలు రహస్యం యెటింగే వున్నాండు. యెఱింగిన్నీ ఆలా అపవదించడాన్ని సమర్థించవలసివస్తే సూతకులంలో చేరివుండడాన్ని పట్టి సమర్థించాలి. ప్రతీవారి చరిత్రానికిన్నీ యేవో నీహారలేశాలు వుండనే వుంటాయి. అవి ప్రాజ్ఞలంతగా గణించరు. మొత్తంలో యొక్కువగా సుగుణాలుండడమే కావలసింది. భారతవీరులలోనే కాదు యితరత్రకూడా యింత వుత్తమచరిత్ర కల మహనీయుండు మృగ్యండు. యీయనవల్ల నేర్చుకోదగిన విశేషాలు లోకాని కెన్నో వున్నాయి. యెంతవాండూ కాకపోతే యీయన్ని గూర్చి కర్మఠులు ప్రతివత్సరమున్నూ మాఘమాసంలో తర్పణాలు వగైరాలు తమతమ పితృదేవతలకు విడిచినట్లు విడవడం తటస్థించదు కదా! విస్తరించవలసి యున్నప్పటికీ సంగ్రహంగా వ్రాసి యిప్పటికి దీన్ని ముగిస్తున్నాను.

★ ★ ★