పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

119

గాని లేకపోతే అట్టిపనికికూడా అంగీకరించేవాcడు కాండు. ఆయీ అపరాధానికి తుట్టతుదను క్షమాపణ చెప్పినట్టు మూ పాండవాశ్వమేధంలో వ్రాసి వున్నాము. ఆ పద్యం వుదహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను.

చ. మృదువగు వెన్నవంటిది శరీరము నీయది యెపు కష్టమ
న్నది సయిపంగనేరదు పదారు సహస్రములిందుకై సదా
మరి జపియింత్రుగోపికలు మాధవ! నిష్కరుణుండనైననా
ప్రదరము లిందునాటి యపరాధ మొనర్చె ననుగ్రహింపవే.

శ్రీకృష్ణునియందు భీష్మునికివున్న భక్తిపారవశ్య మెట్టిదో తెలుసు కోవాలంటే పోతరాజుగారి భాగవతపద్యాలవల్లనే తెలుసుకోవాలి. తిక్కన్నగారి భారతంలో వక పద్యం కాcబోలును- -

ఆ.వె. “బలము నీవ నాకు భక్తుండ నీయెడ నాలు బిడ్డ లేనియట్టివాండ"

అనేది యున్నది. పోతరాజుగారు చాలా పద్యాలు వ్రాసి భీష్మపాత్రలో తాను ఏకీభవించిన తన్మయత్వాన్ని ప్రకటించియున్నారు- "తెరలిచనుదెంచు దేవుండు దిక్కునాకు” అనే పద్యం వగయిరాలు పలువురు భక్తులకు కంఠపాఠమే. కనక వుదాహరించ నక్కఱలేదు. ‘లోకుల రసనలె, యాకులుగా నుండునట్టి యవివో! కవితల్ అనే భాగ్యం పట్టిన కవులలో పోతరాజుగారు మొట్టమొదటివారు. యీయన భీష్ముని భక్తిని వర్ణించినట్లు తిక్కన్నగారు వర్ణించలేదు. పూర్వకవులతోపాటు పేరు తెచ్చుకోవాలంటే తరువాతవారికి వక వుపాయం కనబడుతుంది. యేమిటంటే? వారు విస్తరించని విషయా లేమేనావుంటే వాట్లని పెంచి వ్రాయడమే. ప్రస్తుతం భీష్ముని విషయమై పోతన్నగారు చేసినపని అదే. అయితే అసలు వాణియందు రసమంటూ వకటి వున్నప్పుడే యీ వుపాయం పనిచేస్తుందిగాని ෂඩ් ෂීඨ కవిత్వాలకు ఆయీ వుపాయాలు లేశమున్నూ పనిచేయవు. బాణుcడికి పూర్వమందున్న కవులకేమీ చిక్కులేదుగాని తరవాత బయలుదేణిన కవులకు

"బాడోచ్చిష్టం జగత్సర్వమ్” అనే చిక్కు వచ్చింది. ఇది సూల దృష్ణులమాట. యేదో మార్గాంతరాన్ని పురస్కరించుకొని శ్రీనాథాదులందఱూ పేరుతెచ్చుకొన్నారా, లేదా అంటే జవాబు లేదుకదా! పోతరాజుగారు బాణుcడికి తరవాతివారే అయినా రసవంతమైన వాణి వుండడంచేత పేరు వచ్చింది. ఈలాగే పలువురు పేరుపొంది వున్నారు. దీన్ని గూర్చి మటొకప్పుడు మాటాడుకుందాం. భీష్మణ్ణిగూర్చి యెవరు వ్రాసినప్పటికీ పోతరాజుగారు వ్రాసినట్లుండదన్నది ప్రస్తుతం. భీష్ముండు చేసిన ప్రతిపనిన్నీ శాస్త్రసమ్మతమే అయిన దన్నందుకు ఆయనకు తటస్థించిన వుత్తమలోకావాప్తి సాక్ష్యమిస్తూ వుంది.