పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

110

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఇప్పడిట్టి సస్యగర్భభూదానాలే జరుగుతూ వున్నట్లు లేదుగాని యీలాటివి మాత్రం కొన్ని జరుగుతూవున్నాయి. వాటినే కొందఱు విమర్శనాదక్షులు విమర్శించి ఖండిస్తూవున్నారు. వారికి నేచెప్పే సమాధానమేమిటంటే : మేడున్నవారు మేడెకేరనుకోండి. అది లేనివారో గోడే యొక్కి సంతోషిస్తారు. దూరాన్నున్న వస్తువు మేడమీందవారి కెంత గోచరిస్తుందో గోడమీందవారికిన్నీ అంతే గోచరిస్తుంది. కాCబట్టి వృథాగా మీరు విమర్శించి ఖండించడం యెందుకు? అంటాను. అంటే వారు వింటారూ? యేమేమో యుక్తులు చెప్పడానికి మొదలుపెడతారు. వారి యుక్తులున్నూ తోసివేయడానికి శక్యంకాదు. యెందుచేతంటారా? మేడమీందెక్కడమున్నూ గోడమీందెక్కడం వకటే అంటే మాత్రం బాగా వుంటుందా? ఆలాగయితే బోలెండు ద్రవ్యం వ్యయం చేసి మేడ లెందుకు కట్టుకోవాలి? దేని గౌరవం దానిదే. సస్యగర్భభూదానం ఆవిడ చేసింది కూడా అయితే నిజమైన సస్యగర్భభూదానం యొక్క గౌరవం యెవరికేనా కనపడుతుందా? యిప్పటి మెడల్పులాగే పదడయిపోమా? కాcబట్టి దీన్ని గుటించి బాగా ఆలోచించాలి. ఇంతే నేను వ్రాసేది.

★ ★ ★