పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్యనిషేధం అవసరమే!

105

యింతో గవర్నమెంటుకు సహాయపడడం ఆవశ్యకం కనక ఈ ఉప్పపన్ను ద్వారా అట్టి సహాయాన్ని గవర్నమెంటు పొందుతూ వుందనుకోవాలి. పూర్వపురాజులకు ఋషులు కూడా పన్ను చెల్లించినట్టు “తాన్యుంఛ షష్ణాంకిత సైకతాని” అనే కాళిదాసుగారి శ్లోకపాదంవల్ల అవగతమవుతుంది. ఔషధంగా యీ దేశంలో “బాలవృద్ధాతురులు" వాడుకొనే నల్లమందు నానాంటికి మటీ హెచ్చుధరలో వుండడమనేది సాధుబాధగా పరిగణించవలసిందే కనక మన కాంగ్రెస్సు మంత్రులవల్ల యేమేనా వుపకారం జరిగితే బాగుండును - యేమందుకూ లొంగనికొన్ని బండవ్యాధులు దీనికి లొంగి కాలక్షేపం జరగడానికి పెద్దపెద్ద డాక్టర్లే వప్పుకుంటారు. యెవరిదాకానో అక్కఱలేదు పెద్దడాక్టర్లలో వొక్కరుగా పరిగణించతగ్గ వారున్నూ కాంగ్రెస్సు ప్రముఖులలో అగ్రగణ్యులలో వొకరున్నూ అయిన మన భోగరాజుగారే నల్లమందు మాహాత్మ్యానికి అంగీకరిస్తారు- యే చీనావాశ్లో దీనిని తీరికూర్చుని అభ్యసిస్తే అభ్యసిస్తురుగాక. మనదేశస్టులుమాత్రం అలా అభ్యసించి వుండరనియ్యేవే నానమ్మకం. అందుచేతే యింతగా వ్రాయడం. అయితే మద్యం దొరకని పద్ధతిని ఆబాపతు జనమంతా యీ మీఁద దీనికి యెగcబడతారేమో? అనేదిన్నీ విచారణీయమే యెగందీస్తే బ్రహ్మహత్య దిగం దీస్తే గోహత్యగా, కనపడుతూవుంది. అయినా మొట్టమొదట యీ దీనుల నిమిత్తం దీన్ని సులభసాధ్యంచేసి ಹಿಮ್ಮಿಟ చిక్కువస్తే మార్గాంతరం తొక్కడం యుక్తమేమో? రోగులకుఁగాని యిది యివ్వబడ దనేయెడల సర్టిఫికెట్టు తెచ్చుకోవలసివస్తుంది. అది ద్రవ్యైకసాధ్యం. దానితో ధనవంతులందఱూ సర్టిఫికెట్టు ద్వారా రోగులే అయి తంజావూరు సోమరి సత్రాన్ని జ్ఞప్తికి తెస్తారు. వుప్పంటే గంజిలేకా, గంజుంటే వుప్పలేక తిప్పలు పడే బీదలు సర్టిఫికెట్టుకు ప్రెయివేటుగా యిచ్చుకునేఫీజు తెచ్చుకోలేని రోగుల జాబితాలో చేర్చంబడతారు. పిడిరాయిలాగ తిరుగుతూవున్న వాళ్లెందరో డాక్టరు సర్టిఫికెట్టు సంపాదించుకొన్న పద్ధతిని వుద్యోగం చేయకుండా సెలవులోవుండి జీతం పుచ్చుకోవడమున్నూ నిజంగా రోగులైనవాళ్లు దాన్ని సంపాదించుకోలేక పనిచేస్తూనే వుండడమున్నూ సర్వానుభూతమే కాCబట్టి నల్లమందు యెవరికివ్వాలో యెవరికి వడ్లో తెలుసుకోవడం కష్టం, పెద్దచిక్కేవచ్చింది. దీనిలోవున్న తత్త్వం ಬುದ್ದಿ మదర్రేసరులు మంత్రులకు తెలియకపోదు. కాCబట్టి విస్తరించేదిలేదు. కొనసాగుతోందో లేదో చెప్పఁజాలం గాని గాంధీమహాత్ముండు పూనిన యీ వుద్యమంవల్ల జగత్తుకు కలిగే వుపకారం యింతా అంతా కాదు. స్త్రీలు కూడా తాగుమోతులు లేకపోలేదుగాని స్త్రీలలోకన్న పురుషులలో యూతెగ విస్తారంగావున్నట్టు తెలుస్తుంది. అందులో కూలిజనంలో యిది మిక్కిలి యొక్కువ. ఆ కూలి జనంలోనున్నూ మన ప్రాంతాల్లో వుప్పర్లు సంపాదించుకునే కూలి కొంచెం అదనంగానే వుంటుంది కాని అది సర్వమూ దీనికిందే వినియోగం. పంచమహాపాతకాలలో