పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

14

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

 మిక్కిలిప్రార్ధిస్తాను." అనిచెప్పే వారట! అట్టిస్థితిలో బ్రాహ్మణ ప్లీడర్లే వుండేరోజుల్లో “నాన్ బ్రామిన్సు"కు చదువుసందెలెక్కడ? ఉద్యోగాలెక్కడ? యెవరేనా వక వుద్యోగి వారిలోవుంటే జమీందార్లకు-అందులో క్షత్రియ వెలమ యీ జాతి జమీందార్లకు - వారికి దర్శనమివ్వడానికిఁగాని వారితో మాట్లాడటానికిగాని, బొత్తిగా ప్రాణసంకటంగా వుండేదఁట. దీనికిసంబంధించిన గాథలు పిఠాపురం సంస్థానానికి చెందినవే చాలా వున్నాయి. వాట్లనుగూర్చి మఱొకప్పడు మాట్లాడుకొందాం. అప్పటి జమీందార్లకేమి, ప్రజలకేమి వర్ణాశ్రమాచారాల విషయమై మిక్కిలి పట్టుదల వుండేదన్నది ప్రస్తుతం.

గజానికి గజమున్నర లెక్క

ఆ కారణంచేత శ్రీ పాపయ్యశాస్రుల్లుగారు జియ్యంగారి దర్శనానికి వెళ్లావెళ్లరు, వారిని శ్రీ రాజావారు రమ్మని అనాఅనరు. కాని ప్రస్తుతం అలా జరుగలేదు. దీనిలో మహాపాతక మేముందనే తాత్పర్యంతో, “మహాపండితులుగదా శాస్రుల్లుగా"రని ఆలోచించి, అయినా యేమంటారో చూతామని రాజావారు శాస్రుల్లుగారూ జియ్యంగారి దర్శనానికి మాతో తాము దయచేయడాని కేమైనా అభ్యంతరం వుంటుందా?" అన్నారట, విలాసంగా. దానిమీద పాపయ్యశాస్రుల్లుగారికి పచ్చివెలక్కాయ గొంతుకలో పడ్డట్టయింది పాపం! యేమంటే, నిన్నగాక మొన్న శ్రీరాజావారిచే స్వయముగా “మీకు మా యెస్టేటులో యొక్కడ యెంతభూమి కావాలో కోరుకోవలసిందని కోరుకోcబడి, "నెల 1 కి ఒకపుట్టి భూమి చొప్పున వుంటేచాలును" అనఁగా పుట్టి అంటే మా వైపున 8యకరాలు కనుక "సంవత్సర గ్రాసానికి 12 పుట్ల భూమి 96 యెకరాలు యిప్పించవలసిం"దని కోరుకొని ఆ భూమి వారి స్వగ్రామానికి సమీపంలోవున్న శానపల్లె లంకలో పుచ్చుకొని వున్నారాయె. ఆ పుచ్చుకోవడంలో ఠాణాదారుగారిని, పాండిత్యం చేతనే అనుకోండి, లోపుచేసుకొని 12 పుట్లకు పద్దెన్మిది పుట్లుకూడా కొల్పించుకొని వున్నారు పాపయ్యశాస్తుల్లుగారు. యీ మోసము రాజావారి కేలాగో తెలిసి ఆ ఠాణేదారుని బరతరపు చేశారు కూడాను. ఆ సంగతి పాపయ్య శాస్రుల్లుగారికి తెలిసి మళ్లా రాజావారి దర్శనానికి వెళ్లి తాము మాకు మొన్న దయచేయించిన భూమిని మళ్లా మీరే స్వీకరించవలసింది. మాకు సుతరామున్నూ అది అక్కరలేదన్నారట పాపయ్య శాస్రుల్లుగారు! దానిమీద రాజావారు “ఇదేమి శాస్రుల్లుగారు; యిలాసెలవిస్తూవున్నారు. మేము మీయెడలచేసిన మహాపరాధమేమిటో దాన్ని వ్యక్తీకరిస్తే సవరించుకోcదగ్గదయితే సవరించుకుంటా” మన్నారట. శాస్రులుగారు “యింతకంటే అపరాధ మేం కావాలి. మాకు భూమి కొలిచియిచ్చిన ఠాణేధారుణ్ణి మీరు బరతరపు చేయడంవల్ల మాకు ఆ భూమియందు అనాదరంకలిగిం"దన్నారట. దానిమీcదరాజావారు “మా వుద్యోగస్థుడు మా ఆజ్ఞకు - \