పోలెపల్లి బుక్కరాయలు
61
బహువ్రీహి అనగా హెచ్చు ధాన్యము కలది. బహువ్రీహి అనే సమాసమున్ను అర్థము. విద్వత్కుమార యాచమనాయనివారు పరమానందము చెంది, “మునుపు యిచ్చినది అబద్ధము ఇప్పుడు ఇచ్చినది నిబద్ధి” అని మెచ్చి అట్లాగే మార్చి యిచ్చి సంసారినిన్ని సమాధానపరిచి పంపెను.
పోలెపల్లి బుక్కరాయలు
సీ. కొలువులో మీసాలు కొనలు దిద్దఁగవచ్చుఁ
జికిలిసేనాకత్తి చిమ్మవచ్చు
మేలైనయంగీలు మెఱచి తొడ్గగవచ్చు
సతులు చూడఁగ నెమ్మె సలుపవచ్చు
గరడిసాదనఁజూచి ఘాతసేయఁగవచ్చు
బిరుదులు చదువంగ బిగియవచ్చు
.................................................
.............................................
గీ. కాక యరి నని వ్రేయ సత్కవుల కీయ
నీవె నేర్తువు ధరలోన నేర్పు మెఱయఁ
బరమకల్యాణ! నూతనపంచబాణ!
భూనుతాటోప! తిమ్మయ బుక్కభూప!
సీ. కలగుండ్లువడుబారు కన్పించు దుర్గాలు
కడఁగి భగ్గన విచ్చు గండవిండ్లు
పెందూళిపైఁ గప్పి భీతిల్లుఁ గోటలు
కమలి భస్మంబు లౌఁ గాననములు
చీకాకుపడు దొడ్డసింహాసనంబులు
హల్లకల్లోలమౌ నష్టదిశలు