పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

చాటుపద్యమణిమంజరి

    సాబాసురా యన్న సకలాశ్రితానేక
                    కోవిదులకు మెచ్చి కోటి యిచ్చు
గీ. బళిర! చతురబ్ధిమేఖలాకలితధాత్రి
    చక్రనిర్వక్రపాలనాచారుకీర్తి
    రమ్యముక్తాతపత్రరారాజితుండు
    చారుతరమూర్తి! యిభరాముచక్రవర్తి!
సీ. కర్ణాటకాధీశుకంఠమాలికమీఁదఁ
                    గురురాజుముత్యాలగొడుగుమీఁద
    వింధ్యదేశాధీశువెల్లవల్వలమీఁద
                    గౌళేశువజ్రాలగద్దెమీఁద
    పాంచాలభూమీశుపట్టుపల్లముమీఁదఁ
                    బాండ్యభూపతివెండిబరణిమీఁద
    బంగాళజననాథుపాంచజన్యముమీఁదఁ
                    గుకురేంద్రుధవళగోళకముమీఁద
గీ. ఆడిపాడించు నటియించు నవఘళించు
    మెచ్చి కుప్పించుఁ గెరలించు మేబళించు
    సంతసంబున నీకీర్తి జలజనేత్ర
    మానవోపేంద్ర! యిభరాము మండలేంద్ర!
ఉ. రా యిటు భట్ట! యేమి కవిరత్నమ! పిల్చితి; వీవి పద్యముల్;
    ఏయవనీశుపై? నృపకులేశ్వరుఁడౌ నిభరాముశాహిపై;
    నాయతపుణ్యమూర్తి యతఁ డర్థులు వేఁడిన నిచ్చు; నిచ్చునా
    వేయును రెండువేలు పదివేలును లక్షలుఁ గోట్లు నిచ్చు; నౌ!

కవిత్వము నేర్చినవారికిఁ గాని మల్కిభరామ్ ప్రభువు సమ్మానము మెండుగాఁ గావించుచుండెడివాఁడు కాఁడఁట! ఒకప్పుడు కవిత్వము నేరని చతురు లిర్వురు “కరయుగమును”