పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

చాటుపద్యమణిమంజరి

    చెనటి విరోధులశ.................
                    .........................
    వైరికాంతానేత్రవర్షముల్ కురిపించి
                    పగతుల యమ్ములు పంట చేసి
గీ. మొరయు మన్నీలగుంపుల మొదలు గోసి
    మెసఁగ నూరిచి తూర్పెత్తి యేకరాశి
    గాను గావించె నీకత్తి కాఁపులకొడుకు
    గాయ గోవాళ జగనొబ్బ గండవేమ.

ఈకోమటి వేమారెడ్డి యాస్థానమున మామిడిసింగనాదులు మంత్రులు. తురగారామన యనుమంత్రి దుష్టుఁడట! ఒకకవి వానిఁ బేర్కొనె.

క. కోమటి వేమనత్యాగము
    భూమిఁ బ్రసిద్ధంబు కల్పభూజముచేతన్
    బామున్నపగిదిఁ దురగా
    రాముం డున్నాఁడు చేరరా దెవ్వరికిన్.

సాళువగుండ నరసింహరాయలు

ప్రౌఢదేవరాయలయనంతర మీతఁడు కర్ణాటరాజ్య మాక్రమించుకొని పరిపాలించెను. క్రీ.శ. 1480 ప్రాంతములందీరాజురత్నము కలఁడు. డిండిమభట్టారకుఁ డను సంస్కృతకవి యీతని దిగ్విజయాదికమును వర్ణించుచు సాళ్వాభ్యుదయ మను పదునాల్గు సర్గముల మహాకావ్యమును రచించెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్ర