పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

చాటుపద్యమణిమంజరి

జలకమాడు మఱుఁగుపట్టున భార్య నులకమంచ మడ్డుసేసి పసపుటుండ పెట్టి దాన పైనుంచి నీళ్ళబిందెఁ దెచ్చిపెట్టెనఁట! ఇది యే మని వ్యసనపడి యడుగ—

క. పగఱకు వెన్నిచ్చినచో
    నగరే నిను మగతనంపు నాయకు లెందున్?
    ముగు రాఁడువార మైతిమి
    వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్?
అని యవమానకరముగా సైతము పల్కెనఁట! తర్వాతఁ దల్లి యన్నములో విఱిగినపాలు పోసెను. తిక్కన తల్లి నిదియేమని యడిగెను. తల్లి “నాయనా! నీవు పోయినచోటికే పసులును మేఁతకుఁ బోయెను. అవియును విఱిగి వచ్చినవి. పాలును విఱిగెను.” అనెనఁట!
క. అసదృశముగ నరివీరుల
    మసిపుచ్చక విఱిగివచ్చు మగపందక్రియన్
    గసవున్ మేయఁగఁ బోయిన
    పసులున్ విఱిగినవి తిక్క! పాలున్ విఱిగెన్.
అంతట నన్నము విడిచి లేచి యుద్ధసన్నద్ధుఁడై పోయి పగతుఱ నెదుర్కొని వీరస్వర్గము నందినట్లు నాఁటికవుల వర్ణనము.
చ. పదటున వాజిరాహుతులపై దుమికించుచుఁ దిక్కఁ డార్చినన్
    బెదరి పరిభ్రమించి కడు బిమ్మిట వీరులు భిత్తచిత్తులై
    యదె యిదె వాలు వాల్మెఱుఁగు లల్లవె యల్లదె యాతఁడం చనన్
    గొదుకక యాజిఁజేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై.
ఉ. చిక్కక మన్మసిద్ధివిభుచే మును గొన్నఋణంబు దీర్చె మా
    తిక్కనమంత్రి సోమశిల దేవరసాక్షిగఁ బెన్నసాక్షిగా