పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రణతిక్కన – నెల్లూరుపురము

23

రుఁడు. పదుమూఁడవ శతాబ్దియందు విక్రమసింహపురమున రాజ్యమేలిన మనుమసిద్ధిరాజునొద్ద సేనాని.

సీ. వీరివివాదంబు వేదనినాదంబు
                    పాయక యేప్రొద్దు మ్రోయుచుండు
    భూసురప్రకరంబు సేసలు చల్లంగఁ
                    బాయ కెన్నియొ కుటుంబములు బ్రతుకు
    బ్రాహ్మణావళికి ధారలుపోసినజలంబు
                    సతతంబు ముంగిట జాలువాఱు
    రిపుల కొసఁగిన పత్రికలపుత్త్రికలను
                    బాయక కరణముల్ వ్రాయుచుంద్రు
గీ. మానఘనుఁ డైనతిక్కనమంత్రియింట
    మదనసముఁ డైనతిక్కనమంత్రియింట
    మహితయశుఁ డైనతిక్కనమంత్రియింట
    మంత్రిమణి యైనతిక్కనమంత్రియింట.

మనుమసిద్ధిరాజునకును నెఱగడ్డపాటియేలిక యగుకాటమరాజుకును జరిగినసంగ్రామమున నీధన్యచరిత్రుఁడు కీర్తిశేషుఁ డయ్యెను. పుల్లరియిచ్చు నొడంబడికపైఁ గాటమరాజు తనపసుల మనుమసిద్ధిరాజు మేఁతబీళ్ళలో మేపుకొని యక్కడఁ దలకోడెదూడలలో నేదో నష్టము సంభవించిన దన్నకారణమునఁ బుల్లరి నెగఁగొట్టెను. దానిపై మనుమసిద్ధిరాజు పసులఁ బోనీయడయ్యె. పరస్పరయుద్ధమున కిది కారణము. ఈయుద్ధచరిత్రము “కాటమరాజుకథ”యనుపేర గ్రంథరూపమున వెలసినది. మనుమసిద్ధి పక్షమునఁ గొంతసేనతో ఖడ్గతిక్కన కాటమరాజుసేన నెదుర్కొన కొంత పోరాడి తన బలము చెల్లాచెదరుకాఁగా నిలువరాక తిరిగి యింటికి వచ్చెను. నాఁడు స్నానము చేయఁబోఁగా స్త్రీలు