పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణదేవరాయలు

161

మని తాఁకెను. గజపతికుమార్తెను సాధింపఁ దలం పొదవెను. ఒకనాటిరాత్రి యుపశ్రుతిపరిజ్ఞానమునకై చాకివానియింటిదరి కొకయాప్తభృత్యుని, దిమ్మరుసును బంపెనఁట! ఆయింటి చాకివాఁడు సుఖశయితుఁడై యిట్లు పాడుచుండెనఁట!

    కొండవీడు మందేరా కొండపల్లి మందేరా
    కాదని యెవ్వఁడు వాదుకు వచ్చిన కటకందాకా మందేరా.

విజయసూచకమగు నాయుపశ్రుతిని గొనియే రాయలు దాడి వెడలి కటకమువఱకును గలదేశమును వశపఱచుకొనుటయేకాక గజపతికుమార్తెను గూడ దక్కఁగొని యంతఃపురమున జరిగిన యవమానమును బాపికొనెనఁట!

శ్రీకృష్ణదేవరాయల నిర్యాణకాలము—

ఉ. బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నందుచుండఁగా
    నారయ శాలివాహనశకాబ్దము లద్రియుగాబ్ధిసోములం
    దారణవత్సరంబున నిదాఘదినంబున మాఘ శుద్ధష
    ష్ఠీరవివాసరంబున నృసిహునికృష్ణుఁడు చేరె స్వర్గమున్
    ద్వారక నున్నకృష్ణుఁ డవతారసమాప్తిని జెందుకైవడిన్.

రాయలనిర్యాణానంతరము కొన్నిసంవత్సరములు పెద్దనామాత్యుఁడు జీవించి స్వావస్థ నిట్లు చెప్పుకొనెను—

సీ. ఎదురైనచోఁ దనమదకరీంద్రము నిల్పి
                    కేలుఁత యొసఁగి యెక్కించుకొనియె
    మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
                    బల్లకిఁ దనకేలఁ బట్టి యెత్తె
    గోకటగ్రామాద్యనేకాగ్రహారంబు
                    లడిగినసీమలయందు నిచ్చె