పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

చాటుపద్యమణిమంజరి

సంస్కృతమునఁ జెప్పఁబడిన చాటుపద్యములఁగూడ నిందుఁ జేర్చుట సముచిత మని యట్లు చేయుచున్నాఁడను—

శ్లో. వీరాగ్రేసర! కృష్ణరాయనృపతే! త్వద్వైరికాంతావనే
    ధావంత్యః కుటయానరోమలతికావ్యాహారలీలాభృతః
    ప్రాప్తాన్ కోకమహేభపన్నగశుకాన్ రుంధంతి వక్త్రేందునా
    మధ్యే నాసి కచేన కంకణనసద్వైడూర్యరత్నైరసి.
శ్లో. భో భోభూవర! భూరివిక్రమ! భవద్ధాటీషు విద్యాధరై
    ర్నిస్సాణేషు ధణం ధణం ధణం ధణధణం ధాణం ధణధ్యానిషు
    త్వత్కృత్తప్రతిమల్లవీరవరణే దేవాంగనానా మభూ
    న్నృత్తేభ్యో ధిమిధిమ్మి ధింధిమి ధిమిం ధింధిం ధిమింధింకృతిః
శ్లో. దృగ్భీత్యా నరసక్షమాపతిసభస్త్రీణాం మృగేణాశ్రితో
    రాజా తన్ముఖతర్జిత స్స్వయ మపి త్యక్త్వా౽౽త్మనో మండలం
    దుర్గేశస్య జటాటవీ ముపగతః పాణౌ త మేణం దధౌ
    సన్మార్గప్రవణో నిజాశ్రితతమం క్షీణో౽పి నోపేక్షతే.
శ్లో. వీరాగ్రేసర! కృష్ణరాయ! భవతా కృత్తారణ ప్రాంగణే
    ప్రౌఢాః కేచన పారసీకపతయః ప్రాప్తాః పురీ మామరీం
    పీరుత్తేతి గురౌ, నలద్విషి సురత్తణేతి, శచ్యాంపున
    ర్బిబ్బీతి, ప్రణతౌ సలామితి సురాన్ స్మేరాననాన్ కుర్వతే!
శ్లో. కృష్ణరాయ! స్తువంతు త్వాం కవయో న వయం స్తుమః
    నరసింహకిశోరస్య కియాన్ గజపతే ర్జయః?

శ్రీకృష్ణదేవరాయలు లావణ్యగణ్య మగు నొక స్త్రీరత్నమును బహుయత్నమున సాధించి యవరోధవధూసవిభమునఁ దనయుల్లాసమును వెల్లడించెనట! అంత నాయంతఃపురిక “యింతకే యింత యుప్పొంగవలెనా యిది యేమి గజపతికుమార్తను సాధించుటయొక్కో!” యని తేలనాడెనట! రాయలడెందమున చుఱుకు