156
చాటుపద్యమణిమంజరి
జతురంగ మాడి గెల్చును
ధృతిమంతుఁడు బొడ్డుచెర్లతిమ్మన బళిరే!
ఉ. ధీరుఁడు బొడ్డుచెర్లచినతిమ్మనమంత్రికుమారుఁ డంచితా
కారుఁడు సత్కళావిదుఁడు కౌశికగోత్రుఁడు పద్మనేత్రసే
వారతబుద్ధి నందవరవంశ్యుఁడు సత్కవిలోకనాథుఁడా
చారసమగ్రవర్తనుఁడు చారువచస్స్థితి నొప్పువాఁ డొగిన్.
రాయలు కళింగదేశవిజిగీషామనీష దండెత్తిపోవుచు బెజవాడలో విడిసి హరివాసరోపవాసవ్రతమును గృష్ణాతీరమున నున్న శ్రీకాకుళపుణ్యక్షేత్రమునఁ గావించుటకై పెద్దనాదివిద్వత్కవులతో నరిగెను. అప్పుడే యక్కడ వెలసియున్న యాంధ్రనాయకస్వామి కృష్ణరాయల స్వప్నమున నాముక్తమాల్యద రచింప నాదేశించిన ట్లాముక్తమాల్యదయందుఁ జెప్పఁబడి యున్నది. అక్కడ నేకాదశినాఁడు పండితమండలితోఁ బుణ్యకథాగోష్ఠి సలుపుచుఁ గృష్ణరాయలు దాశరథు లెక్కువవారా? పాండవు లెక్కువవారా? యని ప్రశ్నించెనట. పెద్దనాదులు తమకుఁ దోఁచినరీతిని బలుదెఱఁగులఁ జెప్పిరట. దాశరథులు ఈశ్వరాంశమున జన్మించినవారుగావున వారి కమానుషశక్తులును లోకోత్తరయోగ్యతయును గల్గుట వింతకాదు. పాండవులయెడ నీశ్వరాంశములేదు. అట్లయ్యు శక్తులయందును యోగ్యతయందును దాశరథులతో సాటివచ్చిరి. కావునఁ బాండవులే యెక్కువవా రగుదురని తనయాశయమును రాయలు తుదకు వెల్లడించెనట! అది విని రాయలప్రక్కను జామరము విసరుచున్న చాకలియొకఁడు కేలుమోడ్చి “దేవర జన్మాంతరమున నున్నను బాండవుల