కృష్ణదేవరాయలు
151
జూఱలఁగొని సంస్కృతాంధ్రములందు మేలయిన కవనము సెప్పనేర్చిన సుకవిరాజశిఖామణి. ఆంధ్రమున విష్ణుచిత్తీయమును సంస్కృతమున మదాలసాచరిత్రాదికములు నీతనికృతులు. ఆంధ్రవాఙ్మయమున కీమహారాజుకాలమున నిం తం తనరానిమహోన్నతి చేకూఱెను. పెద్దనాదికవిశ్రేష్ఠు లీతని యాస్థానమునఁ గవీశ్వరులు. మనుచరిత్రము పారిజాతాపహరణము మొదలగు కృతుల కీతఁడు కృతిపతి. పెద్దనామాత్యున కీతఁ డాంధ్రకవితాపితామహుఁ డన్నబిరుద మొసఁగెను. విద్యావిషయమున నీమహారాజు నాస్థానమునందు జరిగినవృత్తాంతములు వింతవింతలుగాఁ జెప్పుకొనఁబడుచున్నవి. కొన్నిమాత్ర మిందుఁ దెల్పఁబడును.
ఒకప్పుడు కృష్ణరాయలు పసిఁడిపళ్ళెరమునఁ గవిగండపెండేరమును గొనివచ్చి సభాస్థానమున నిడి సంస్కృతాంధ్రములందు సమముగాఁ గవనము సెప్ప నేర్చినవా రిద్దానిఁ గైకొన నర్హు లనఁగా సభ్యులు మిన్నకుండిరనియు దానిపై నాతఁడే—
ఉ. ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నాకొసంబు మనియొక్కరుఁ గోరఁగలేరు లేరొకో—
అని సగముపద్యముఁ జదివినఁ బెద్దనామాత్యుఁడు లేచి—
పెద్దనబోలుపండితులు పృథ్విని లే రని నీ వెఱుంగవే
పెద్దన కీఁదలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణ్ణృపా!
అని పూరించి యీమాలిక నాశువుగా రచించి చదివె నఁట!!
ఉ. పూఁతమెఱుంగులుం బసరుపూఁపబెడంగులుఁ జూపునట్టివా
కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనగమ్మనన్వలెన్