పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

చాటుపద్యమణిమంజరి

పల్లుగా నదుకుకొనెను. మఱునాఁడు రాయలసభకు వచ్చినప్పుడెట్లో యీవార్త రాయలకుఁ దెలిసి యాస్థానకవుల కిట్లు సమస్య నొసఁగెను— “రవి గాననిచోఁ గవి కాంచునే గదా” ఏకవియోగాని సరిగా నిట్లు పూరించెను—

ఉ. ఆరవి వీరభద్రుచరణాహతి డుల్లిన బోసినోటికిన్
    నేరఁడు రామకృష్ణకవి నేరిచెఁబా మనముక్కుతిమ్మరాట్
    క్రూరపదాహతిం దెగిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప
    ల్గా రచియించె నౌర! రవి గాననిచోఁ గవి కాంచునే గదా!

ప్రెగడరాజు నరసరా జనుకవియొకఁడు పెద్దనాదికవీశ్వరుల సరకుగొనక వారికవిత్వములందు దోషములు గలవని యందందు వదరులాడుచుండెడివాఁడఁట! ఆతఁడును స్వతస్సమర్థుఁడే. ఒకప్పు డాతఁడు కృష్ణరాయల యాస్థానమునకు వచ్చి పెద్దనాదులకంటె హెచ్చుగా నాశువుగాఁ గవిత్వము రచింతును; సభ కూర్పింపుమని కోరెను. రాయలు మఱుదినము సభగూర్ప నంగీకరించెను. పెద్దనాదులు కొంకఁదొడఁగిరి. రామకృష్ణుఁడు “నే నాకవి నడఁగఁద్రొక్కెద”నని పెద్దనాదులకు ధైర్యము చెప్పెను. మఱునాఁడు సభకు నరసరాజు వచ్చి గంటకుఁ గొన్నివందలు పద్యములు చెప్పెదననెను. వారిర్వురకు స్పర్థ యేర్పడెను. నీ కవిత్వమునఁ దప్పు లుండునని నరసరాజు రామకృష్ణు నాక్షేపించెను. ఉండునేమో! నేను కవిత్వము చెప్పెదను; చూపుమనెను. నరసరాజునకు వ్రాయడమునఁ దనయంతవాఁడు లేఁడనియు గర్వము గలదు. గావునఁ దానె వ్రాసెదననియుఁ గల మాఁగనీయనంత వడిగాఁ జెప్పవలయుననియుఁ దప్పులు చెప్పిన