తెనాలి రామకృష్ణకవి
143
యుమతకయ తిని సెపితివొ
యమవసనిసి యనెడిమాట యలసనిపెదనా!
అని యాక్షేపించె నందురు. ఈయాక్షేపము నొకవేళఁ బరిహాసమునకై పెద్దనామాత్యునిఁ గూర్చి రామకృష్ణుఁడు చేసియుండునేమో! ఈతనికిఁ బెద్దనపై నపరిమితగౌరవము కలదు. పెద్దన్న కెంతోయుత్కృష్టత వెట్టి దనకెంతయు నిసృష్టతను బద్యమునఁ జెప్పుకొనెను—
క. కవి యల్లసానిపెద్దన
కవి తిక్కనసోమయాజి గణుతింపంగాఁ
గవి నేను రామకృష్ణుఁడఁ
గవి యనునామంబు నీరుకాకికి లేదే?
అల్లసాని పెద్దన కవి, తిక్కన సోమయాజి కవి, రామకృష్ణుడను నేను కవిని, ఇంకను గొందఱకుఁ గవియనుపేరు గలదు, నీరుకాకికిని కలదు అనికూడ నర్థము చూచుకొన నగును.
నందితిమ్మన యొకనాఁడు తనయింట నుయ్యెలలో నూఁగుచుఁ గవిత్వము రచించుకొనుచుండఁగా నీకొంటెకోణంగి రామకృష్ణుఁ డక్కడ కరిగి ‘తాతా! ఊతునా’ యని యడిగెనట! తిమ్మకవి యంగీకృతి సూచింపఁగా రామకృష్ణుఁడు తుబుక్కన మొగమున నుమిసి, ‘నీకిదేమిచేటుఁగాల’మన ‘నూఁతునా యనిగదా నేనడిగినది; దాని కంగీకరించితిరి గావున నట్లు చేసితి’ ననెనఁట! కోప మాపఁజాలక తిమ్మకవి యెదురనున్న యాతని నుయ్యెలపైనుండి యెడమకాలితో మొగమునఁ దన్నెనఁట! పాపము పల్లూడెను. చప్పున నింటి కరిగిదుప్పికొమ్ము నరుగఁదీసి