పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

చాటుపద్యమణిమంజరి

    కుటిలవైరులఁ ద్రుంచి కొల్లఁ బట్టింపఁడే
                    శ్రీలు మీరఁగ బోర లోలకోట
గీ. పాదుషాదత్తఘనరాజ్యపదనిరూఢిఁ
    జెందె శ్రగుంటుపలికులశేఖరుం డ
    టంటు నీవైరిమంత్రు లిట్లంద్రు భువిని
    మంత్రికులహేళి ముత్తయామాత్యమౌళి.

గుంటుపల్లి నరసింగమంత్రి


క. యాచకసంరక్షణకై
    భూచక్రమునన్ జనింపఁ బొ మ్మని నిన్నా
    వాచస్పతి పంపెనటే
    నాచక్కని గుంటుపల్లి నరసింగన్నా!
గీ. గురుయశశ్శాలి యగునట్టి గుంటుపల్లి
    మంత్రినరసింగరాయసన్మందిరమున
    నొక్కనాఁటివ్యయంబగుఁ దక్కినట్టి
    దేశపాండ్యాల యొకయేఁటిప్రాశనంబు.
మ. వరగంభీరతసింధురాజు కళలన్ వారాశిపుత్త్రుండు సుం
    దరభావంబున మన్మథుండు కరుణ న్దార్క్ష్యధ్వజుం డార్యస
    ద్గురునిప్రావనదానకర్ణుఁ డఖిలక్షోణీస్థలిన్ మంత్రిశే
    ఖరుఁ డీశ్రీకరగుంటుపల్లినరసింగామాత్యుఁ డెన్నందగున్.

నంది సింగన

పారిజాతాపహరణమును రచించిన నందితిమ్మనకు ముక్కు పొడుగుగా నుండుటచే ముక్కుతిమ్మన్న యనియుఁ బేరుకల్గెను.