పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోటసింగరాజు

93

శేఖరచరిత్రమును రచియించిన మల్లయకవితండ్రి మాదయ మైరావణచరిత్రమున వెంజెర్ల గోపమంత్రి తన్నిట్లు ప్రశంసించినట్లు చెప్పుకొన్నాఁడు.

సీ. మెప్పించినాఁడవు మెఱవడిఁ గర్ణాట
                    నరనాయకుని వీరనారసింహు
    ధట్టించినాఁడవు తస్కరకవిరాజిఁ
                    గోటసింగయ మంత్రి కొల్వులోన
    కాంచినాఁడవు కనత్కాంచనాభరణంబు
                    లేపార నందాపురీశుచేత
    అందినాఁడవు నుత్తమాశ్వద్వయంబును
                    గడిమి భూమండలరమణుచేత
గీ. నతిమతిస్ఫూర్తిఁ గ్రోడించినాఁడ వఖిల
    కావ్యలక్షణలక్ష్యసాగరము నెఱయ
    నిన్నుఁ బేర్వేర వర్ణింప నింక నేల
    ప్రోడ వన్నింట సర్వయమాదసుకవి!

కోటసింగరాజు నిరతాన్నదాత


సీ. పాయసాన్నప్రౌఢిపరిపాకమే చాలు
                    పిండివంటలరుచుల్ మెండు మేలు
    ఆజ్యప్రభావంబు రాజ్య మేమని చెప్పఁ
                    బల్చని పెస రొల్పుఁ బప్పు చెప్ప
    మెత్తనై స్వచ్ఛమై మెదవెడు రాజాన్న
                    మెన్నఁ గైకొంటి మోయన్న! నిన్న
    బహువిధశాకప్రపంచంబు తుదిముట్ట
                    నూరుఁగాయలరుచు లొరవు లుట్ట