92
చాటుపద్యమణిమంజరి
క. వంచింపఁ జనదు మంత్రికి
వంచించినఁ గీర్తి గలదె వసుమతిలోనన్
బెం చనిసిన ఖం గనునా
కం చవిసిన ననును గాక కరణము మల్లా!
క. కరణము గ్రామాభరణము
కరణము తమవంకవారి కాభరణం బౌ
కరణము నృపునుపకరణము
కరణము కులవార్ధిచంద్ర కరణము మల్లా!
బండారు కేతమంత్రి
ఉ. ఆలములోన నోడమికి నన్యవధూటులదిక్కు వోమికిన్
మేలిమి కైన బొంకమికి మెచ్చినచో వృథ గామికిన్ మహీ
పాలనకీర్తిలోలుఁ డగు బండరుకేతననీతిసాటికిన్
నాలుక మడ్డుపట్టెద మనంబున రాముని నిల్పి వేడుకన్.
సీదయయాచమంత్రి
ఉ. మీఁదవెలుంగు పూర్ణశశిమేనికళంకము కప్పుఁ గ్రిందటల్
రోఁదుచు నున్న శేషఫణరోచులకప్పు సుధాపయోధిలో
నీఁదెఁడు కృష్ణు కప్పుఁ బరమేశ్వరుకంఠము కప్పుఁ గప్పి మా
సీదయయాచకీర్తి విలసిల్లెను దిక్కులఁ బిక్కటిల్లుచున్.
కోటసింగరాజు
ఈతఁడు విద్యానగరప్రభువును శ్రీకృష్ణదేవరాయల తండ్రియు నగు వీరనరసింహరాయలకాలమున నున్నవాఁడు. రాజ