పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2


ఏమయినను, రుచ్యంతరములేని కేవల మధురపదార్ధభక్షణము మొగము మొత్తుపగిది రచనావిభేదములేని నవలాపఠనమును విసువుపుట్టింపకపోదు. కావుననే మే మీ గ్రంథమాలయందు సకలజన సుబోధములును సరసకర్ణ రసాయనములును నగు ఖండకావ్యములు, (ప్రాచీన) ప్రబంధములు, నాటకములు, నవలలు, గద్యప్రబంధములు, ఆంధ్రీకరణములు మున్నగు వివిధ గ్రంథములను నాలుగుమాసముల కొకటి వంతునఁ బ్రకటించి పాఠకులకందింపఁ దలఁచి యున్నారము. మఱియు విద్యార్థులమేలు నర్థించి కాళిదాసాదిమహాకవుల కావ్యములను వచనరూపమున నాంధ్రీకరించి యిందుఁ బ్రకటింప సమకట్టియున్నాము.

కావున భాషాభిమానులెల్లరును మా యుద్యమమునకుఁ దోడుపడి లోకకల్యాణసంధాయకు లగుదురు గాక.

చాటుపద్యరత్నాకరము ముద్రితపూర్వమైనను ప్రతులెచ్చటను దొరకమిచే బలువురికోరికపై నిందు ప్రథమకుసుమముగా వెలువరించితిమి.

సంపాదకుఁడు.