పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

చాటుపద్యరత్నాకరము

మోచర్ల వెంకన్న

వెంకన్న దత్తప్ప వీరిరువురు నన్నదమ్ములు. తెలుఁగు కవులు. నియోగిబ్రాహ్మణులు. వీరి నివాసగ్రామము నెల్లూరుమండలములోని “తెట్టు” అను గ్రామము.

ఒకనాఁ డొక వైయాకరణుఁడు వెలుగోటి విద్వత్కుమారకృష్ణయాచభూపతిం దర్శింపఁగా నారాజు— “మీరు తెలుఁగు కవన మల్లఁగలరా?” యని యాపండితుని ప్రశ్నించెనఁట. అందులకు వ్యాకరణపండితుఁ “డయ్యా నేను శబ్దశాస్త్రమునఁ బ్రవీణతగలవాఁడను. సంస్కృతమున నించుకకవనధాటియుఁ గలదు గాని యాంధ్రమున నాకుఁ బరిచయము లే”దనెనఁట. ఆరాజున కాంధ్రమున నించుకప్రజ్ఞయు నధికాభిమానమును గలదఁట. అందుచే నాపండితుని పాండిత్యమును గణింపక యాచభూపతి “తెలుఁ గెఱుఁగఁడు సంస్కృతంపు తెన్నే మెఱుఁగున్ అనినట్లు తెనుఁగు తెలియని నీసంస్కృత మెందుకు పొ”మ్మని నిరాదరించెనఁట! పాప మాపండితుఁ డేమిచేయుటకుఁ దోఁపక అప్పు డీవెంకనకవిని దర్శించి తనకుఁ గలిగిన యవమానమును దెలుప నాయవమానము తనకు జరిగినట్లు భావించి వెంటనే రాజసముఖమునకు బయలుదేఱుచు ఆరాజుచేతనే మీకు నూటపదా ర్లిప్పించెద రండీ యని ప్రతిజ్ఞఁ జేసెనఁట. వ్యాకరణపండితుని వెంటఁబెట్టుకొని వెంకన యాచభూపతిసంస్థానమునకుఁ బోయి “తెలుఁగుకవులు వచ్చినా”రని తెలియఁజేసెను. “దయచేయవల