పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

65

రాజుభాగమును బంచి యియ్యక తామే యపహరించుచుండ వారికి నీవైనను బుద్ధినిఁ దెల్పుమని బొగ్గవరపు వేంకటరాయుఁడను నాగ్రామకరణమునకుఁ గవి యీక్రిందిపద్యమును వ్రాసి పంపెను.

ఉ. మాన్యపుఁబాలిధాన్యము సమర్థులమంచు హరించువారలన్
   హైన్యముచెందుఁగాని, ‘భళి’ యందురె? భూజను లోయనన్యసా
   మాన్యవివేక! నీవయిన మంచిగుణం బుపదేశమిమ్ము ప్రా
   వీణ్యముతోడ బొగ్గవరవేంకటరాయ! ప్రధాని శేఖరా!

ఈకవి బెజగము నరసయ్యయనునతనిపైఁ జెప్పిన పద్యము

సీ. నీచిఱునవ్వు వెన్నెల బెదరింప నా
            మోము చందురు గేరు టేమి చెప్ప?
   నీకన్ను లంభోజనివహంబు నగ బొమ
            ల్కామువిండ్లను గేరు టేమి చెప్ప?
   నీ వర్థిజనకల్పవృక్షంబు నాఁ జేతు
            లామానికొమ్మలం చేమిచెప్ప?
   నీనడ ల్మదకరికానఁజేయగఁ నూరు
            లిభహస్తనిభములం చేమిచెప్ప?
   చక్కఁదనములకుప్పగా సరవి నిన్ను
   ధాత జనియింపగాఁ జేసె ధరణిలోన
   సకలశ్రీభూసురాశీర్వచనవివర్ధి
   తాన్వయనిధాన! కృతిగర్భితాభిధాన!

ఈపద్యమునం దాతనిపే రిముడ్పఁబడియున్నది.