పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

చాటుపద్యరత్నాకరము

సీ. నీదుభార్యామణి నీరజాక్షునిరాణి
            నవలీల నవలీల నవఘళించు
   నీరమ్య మగుపాణి నిర్జరాగశ్రేణి
            నీవిచే ఠీవిచే నీసడించు
   నీకరస్థకృపాణి నీ మనోజ్ఞకృపాణి
            వలె ధార్మికోద్ధారపటిమ నెసఁగు
   నీచారుతరవాణి నీచారుతరవాణి
            గావాణి వాణీశుఁ గడు హసించు
   ననఁగ సామాన్యులకు నీదుగుణగణముల
   గణన సేయంగఁ దరమె? యగణ్యపుణ్య
   వర్ణ్యశ్రీతాడువాయిసద్వంశచంద్ర!
   వేంకటనృసింహమంత్రీంద్ర! వినుతసాంద్ర!

బొగ్గవరపు పెదపాపరాజు

ఈకవి నిజామురాజ్యమునకు వెళ్ళినప్పు డొకగ్రామములో నీకు భోజనసామగ్రి యేమేమి కావలయుఁ జెప్పుము పంపించెదమని అక్కడివారనఁగా నీతఁ డీపద్యమును జెప్పెనఁట.

క. ముప్పావుశేరు బియ్యము
   పప్పఱసోలెండు నెయ్యివావెఁడు పూబం
   డొప్పారపావుశేరుగ
   నిప్పింపుడి యుప్పుగాయ లింతే చాలున్.

ఈకవికిఁ బోట్లూరనుగ్రామములో మాన్యము కలదు. దాని కిద్దఱు ముగ్గురు భాగస్థులు కలరు. ఆభాగస్థులు యీపాప