పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలానిధి గ్రంథమాల


ఈకాలమున నెన్నియో గ్రంథమాలలు బయలువెడలి యెన్నోవిధముల భాషాసేవ సేయుచున్నవి. అయినను భాషా యెన్నోవిధముల భాషాసేవ సేయుచున్నవి. అయినను భాషా సతీవరివస్య యెందఱెన్ని తెఱఁగుల నొనరించినను, అతిమాత్రము కాదన్న నమ్మకమున మేమీయుద్యమమునకుఁ బూనుకొంటిమి.

సాధారణముగా గ్రంథమాలలన్నియు నవలా రచనమునకే తనశక్తిని ధారవోయుచున్న వనుట సత్యమునకు దూరముకానిమాట. కథాకల్పనా చమత్కారకలితమగునవల ఆనందప్రదముకాదని నేననుగాని అందు బాషావధూటి సంధులు వదలి, ధాతువులుచెడి, ధ్వనిసన్నగిల్లి, తొట్రుపాటు లేక చక్కఁగా నొక్కపదమైనఁ బెట్టఁజాలని నీరసస్థితిలోనుండునని మాత్రమనక తప్పదు. ఇఁక నలంకారములమాట అడుగవలయునా? ఇట్లనుటచే భాషాసౌష్ఠవముగల నవలలులేవని మా యభిప్రాయము కాదు. అవి వ్రేళ్లపై లెక్కపెట్టఁ దగినన్నిగా నుండును. కల్పనాసౌందర్యమునకుఁదోడు భాషాచాతుర్యము గల నవల సౌందర్యముతోడి సంభాషణ చతురిమగల నవలా వలె రసికుల నలరింపఁజాలునుగదా?