పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

59

   పటలతృటద్ధరణ్యకశిపాంగనృసింహకఠోరరంహమై
   యటమట లై చనంగవలె; నాదరణాప్తి నొకింతఁ జూచినన్
   చటుకున సౌరదంతిలసదశ్వశతాంగసువర్ణపేటికా
   పటహధణాంధణాంధణనభాంకరమత్తమరాళగామినీ
   భటపటహారహీరచటబంభమబంభమబంభమారవో
   త్కటకటఝర్ఝరాయితచకాసనదంతనిరంతరంబులై
   కటువులు నిండఁగావలయు; గట్టిగ దీవనఁ జేసి చూచినన్
   బటదురుతల్పమత్స్యగశివంకరశంకరవిశ్వసృట్ఛచీ
   విటవరుణాగ్రమారుతకుబేరయమేందుదినేంద్రదేవతా
   ఘటభవనారదాత్రిశుకగౌతమముఖ్యతపస్విరాడ్వరో
   త్కటకసమస్తధేనుమణికల్పమహీరుహపాళు లెల్ల ముం
   గిటశర ణంచు నిల్వవలెఁ గీర్తినిఁ గోరిన మానవోత్తముల్
   కటువులు పల్కఁగా వలదొ కానొకవేళ నొకించు కేనియు
   న్సటమట లౌదు రూ రెఱుఁగ సాటెద సాటితి జాగ్ర తింక వేం
   కటగిరివాస తప్తమృదుకాంచనవాస రమేశభక్తుఁడన్.

తిరుమల బుక్కపట్టణం తాతాచార్యులు

ఈశ్రీవైష్ణవకవి నివాసగ్రామము గుంటూరుమండలములోని చిఠాపురమను నగ్రహారము. ఆయగ్రహారములో నీయనకును భాగము కలదు. తాతాచార్యులు మంచి యాశుకవియు ప్రబంధకవియునై యశస్సుఁ గాంచిన ఘనుఁడు. తగుపాటిదూరములో నిలుచుండి గోడకుఁ దగులునట్లు రాయివేసి యారాయి క్రిందఁబడులోపలఁ గందపద్యమును జెప్పు ప్రజ్ఞగలవాఁడని