పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

49

జేసెనఁట. అందులకు సూరన, యారాజును బ్రార్థింపక, తనమాన్యమున నిలిచిన మోకాలిబంటిముఱుగునీటిలో నిలుచుండి గంగాభవానినిగుఱించి నాలుగుపద్యములను జెప్పఁగా, నారాజు కట్టించిన యడ్డుకట్ట తెగి, ముఱుగునీ రంతయుఁ గ్రింది పల్లమునకుఁ బోయెనఁట. ఆపద్యము లీక్రిందివే—

సీ. బ్రహ్మాండభాండసంపత్తిఁ గుక్షినిఁ గల్గు
            పద్మనాభునిపదాబ్జమునఁ బుట్టి
   సకలరత్నాకరస్థానమై యుప్పొంగు
            నంబుధీశునిచరణంబుఁ ద్రొక్కి
   పరమతత్త్వజ్ఞుఁడై పరఁగు శంతనుమహీ
            రమణువామాంకభాగమునఁ జేరి
   అఖిలలోకాధ్యక్షుఁడై మించి విహరించు
            శివుజటాజూటాగ్రసీమ నిలిచి
   తనరు నీవంటిధన్య కుత్తమము గాదు
   పూసపాటిమహాస్థానభూమియందుఁ
   గాలు త్రొక్కంగ నోడుఁ జండాలుఁడైన
   గదలు మిటమాని దివిజగంగాభవాని!

సీ. ఆదిబిక్షుం డీతఁ డని రోసి విడియాకు
            గొనివచ్చి యిట నిల్వఁ గోరితొక్కొ
   జగడాలచీలివై సవతితోఁ బోరాడి
            వీఁగివచ్చి యిచట డాఁగితొక్కొ
   నిర్జరాంగన లెల్ల నీఱంకు వెలిఁబుచ్చ
            దూఁబవై యిచ్చోట దూరితొక్కొ