పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

చాటుపద్యరత్నాకరము

సీ. అవధారు! దేవ! మహాప్రభూ! విన్నపం
            బాశ్రితోత్తముఁడ శుద్ధాంధ్రకవిని
   పేరు సూరన యింటిపే రడిదమువారు
            మాజాగ భూపాలరాజరేగ
   నల్లకృష్ణక్షమానాయకాగ్రేసరుం
            డెఱ్ఱకృష్ణక్ష్మాతలేంద్రు లచటఁ
   గరణీకధర్మంబుఁ గల్పించి మాన్యంబు
            దయచేసి రది యాస్పదంబు మాకు
   అదియు నీయేఁడు దంతులూరన్ననృపతి
   సత్తముఁడు గ్రామ మంతయు గుత్తఁ జేసి
   చెఱువు బిగఁగట్టె ప్రజలు జేజేపడంగ
   ముంచఁ గట్టించె మాపుట్టి ముంచఁ దలఁచి.

సీ. విన్నవించెద నాదువృత్తాంత మది కొంత
            చిత్తగించు పరాకు సేయఁబోక
   పొలములో నొకఁ డూడు పూడ్చంగఁ జాలఁడు
            గంగాభవాని ఢాకాకు వెఱచి
   దుక్కిటెడ్లను గొని దున్నుద మన్నచో
            బదు లీయఁ డొక్కండుఁ బాతనేబు
   నేజోలికినిఁ బోక యింట నుండుద మన్న
            సాలుకు వచ్చు గంటాలపన్ను
   తెరువు తలగాదు పొన్నూరు తెన్ను గాదు
   పంటపస లేదు గంటాలపన్ను పోదు
   మీకు దయరాదు మునుపటి మిసిమి లేదు
   అతులగుణదీప! విజయరామావనీప!

వేఱొకప్పు డాయన్నమరాజు సూరకవిమాన్యమునుండి చెఱువుముఱుగునీరుఁ బోనీక, యడ్డుఁగట్టించి చిక్కులు కలుగఁ