పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

చాటుపద్యరత్నాకరము

సంతసించి “ఓరీ! నీవేమి కోరెద” వన నా మంగలి “అయ్యా! తమ యనుగ్రహమున నాకేమియుఁ గొదువలేదు. కాన రుద్రకవినిఁ జక్కఁగా సన్మానించి పంపుఁడని మాత్రము మిమ్ముఁ గోరుచున్నా” ననెను. వానిసుగుణసంపద కాసంస్థానాధిపతి మెచ్చి వాని కేదో కొంతబహుమాన మొసంగి పంపివేసెను.

తరువాత రుద్రకవి రాజు దర్శించి, భద్రకవిపై వచ్చిన కోపముం బట్టఁజాలక, మంగలికొండని భూషించుచు నీపద్యముం జదివెను.

క. ఎంగిలిముచ్చుగులాములు
   సంగతిగా గులము జరుప జనుదెంచిరయా
   ఇంగిత మెరిగిన ఘనుడీ
   మంగలి కొండోజి మేలు మంత్రులకన్నన్

ఈపద్యమును విని భద్రకవి మండిపడి

చ. జబగడదష్షు లణ్ణు శషసర్రు కపయ్యుఝభఞ్ఞటంచు వా
   జబజబలెల్లఁ జూపి యగసాలెల, బేలల, బోయపాలెపుం
   బబువుల గెల్చి చేతఁ గలపైకము దోచుటగాదు, రుద్ర నీ
   డబడబ భద్రమంత్రియెదుటం గొనసాగదు పొమ్ముపొమ్మికన్.

అనుపద్యమ్ముఁ జదువఁగా రుద్రకవి

క. భద్రా! శ్వానము మొఱఁగిన
   రుద్రాంకితజంగమయ్య రూఢికిఁ గొదవా?