పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తక్కుచరణములను సాధారణరీతినిఁ బూర్తిచేసెను. ఆకవి ఆయుచ్చారణ నెట్లు వ్రాయుటకుఁ దోపక—అందుల కొక యఱగంట యోచించి తుదకిట్లు వ్రాసెను.

క. వక్కలు చేరెఁడు నేఁగొని
   చొక్కాలోఁ బోసికొంటి—చొచ్చొచ్చొచ్చొ
   యెక్కడి దొంగలు వచ్చిరొ!
   అక్కఱకును లేకపోయె హరిశ్రీకృష్ణా.

పద్యమును బూర్తిగాఁ జెప్పినపిమ్మట రామకృష్ణకవి చాలసే పూరకుండవలసె. సభ్యులందఱును జప్పటలు గొట్టిరి. వ్రాయసకాని ప్రజ్ఞ గంగఁగలసె. మొగము వెలవెలఁ బోయె. రామకృష్ణునియుక్తి కందఱును శ్లాఘించిరి.

ఈకవి తనకవిత్వమును గూర్చియు తనపాండురంగవిజయమును గూర్చియుఁ జెప్పిన పద్యము.


[1]సీ. ప్రౌఢదీర్ఘసమానసపదములఁ గూర్చి శ్రీ
            నాథుండు కూలార్చె నైషధంబు
   దానితల్లిగ నల్లసానిపెద్దన చెప్పె
            ముదిమదితప్పి యాముక్తమాల్యద
   దూహించి తెలియరాకుండ సూరపరాజు
            భ్రమఁ గళాపూర్ణోదయము రచించె

  1. ఈపద్యము శైలినిబట్టియుఁ దెనాలిరామకృష్ణకవితరువాతివాఁడగు సూరనను బేర్కొనుటంబట్టియు, నంత విశ్వసనీయముగఁ దోఁపదు.