పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

   భంగమొందిన యలరామలింగముఖులు
   సాటి రాఁగలవారె నీతోటి; ఔర!
   ఆంధ్రకవితాపితామహ, యల్లసాని
   పెద్దనార్య, విశేషవివేకధుర్య!

ఒకనాఁ డాంధ్రకవితాపితామహుఁడు ఈక్రిందిపద్యమున వ్రాయ నారంభించి

మ. మృదుతల్పంబు వికారలీన దిగి ధమ్మిల్లంబుఁ జేబూని రా
   గద దృగ్జాలముతోడఁ గౌను నులియూఁగన్ మోము మార్వెచుట్టువ్
   వదలం జాఱిననీవిఁ బట్టుకొని యావామాక్షి యట్లేఁగెఁ....

అని యంతవఱకు వ్రాసి పైనెట్లు ముగించుటకుం దోపఁక తాటియాకును గంటము నచటఁ బెట్టి యెచ్చటికో పోయెనఁట. పెద్దనగారి కూఁతు రాయసంపూర్ణపద్యమునుం జదివి యీరీతిఁ బూరించెనఁట

   “ద, త్సదనభ్రాజితరత్నదీపకళికాస్తంభంబు క్రీనీడకున్.”

పెద్దనగా రేదోరీతినిఁ బద్యమును బూర్తిఁజేసి యాయభిప్రాయమును తాటియాకుపై లిఖింపఁబోవఁ బైరీతిని వ్రాయఁబడియుండెను. తన యభిప్రాయమునకన్న నాయభిప్రాయమే రసవంతముగానున్న కతన దాని నట్లే యుంచి, అట్లు పద్యమును బూరించినది తనకూఁతురని యెఱింగి యపరిమితానందమును జెందెనఁట.

తెనాలి రామకృష్ణకవి

పండితమండనుఁడై, కవులలోఁ బ్రౌఢకవియై, హాస్యరసమునకు పుట్టినిల్లై, రాజులచేతను, కవిరాజులచెతను బూజలంది, ఆచంద్రతారార్కమైన కీర్తి సంపాదించి, తనపేరు భూమం