పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతనిగూర్చి వేఱొకకవిచేఁ జెప్పఁబడినపద్యము—

చ. మతిఁబ్రభ నీగిఁ బేర్మి సిరి మానము పెంపున భీమునిన్ బృహ
   స్పతి రవిఁ గర్ణు నర్జునుఁ గపర్ది సుయోధనుఁ బోల్పఁ బూననా
   మతకరిఁ దీక్ష్ణు దుష్కులు నమానుషు భిక్షు ఖలాత్ము నెంచ వా
   క్సతిపు శశిన్ శిబిన్ కొమరుసామిని మేరువు నబ్ధిఁ బోల్చెదన్.

ఈకవి ఏకారణమువలననో కోపము పెల్లుఱేగి కోమటిపైఁ జెప్పిన పద్యములు.

చ. గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
   కును గపటంబు లాలనయుఁ గుచ్చిబుద్ధియు రిత్తభక్తియున్
   ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
   కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుఁదనంబును మూర్ఖవాదమున్.

ఉ. కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లేద; యింటికిన్
   సేమ మెఱింగి చిచ్చిడినఁ జెందద పాపము; వాసి నెప్పుడే
   నేమరుపాటున న్మఱియు నేమియొనర్చిన లేద దోస మా
   భీముని లింగమాన! కవిభీమునిపల్కులు నమ్మి యుండుఁడీ!

అని యీకవి పద్యమును జెప్పఁగా విని వేఱొకకవి—

ఉ. లేములవాడ భీమ! భళిరే! కవిసన్నుత! పద్యమందు నీ
   వేమని చెప్పినాఁడ వొకయించుక కోమటిపక్షపాతివై
   కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లే దటందురా?
   కోమటి కొక్కటీక పదిగొన్నను దోసములేదు లేశమున్.

అని పద్యమును జెప్పెను. (వేములవాడ భీమకవికి వేములాడ భీమకవి, లేములవాడ భీమకవి యనుపేర్లుగూడ వాడఁబడి యున్నవి.) ఒకానొకవిప్రుఁడు తనప్రియురాలితోఁ దనకు వియోగము ప్రాప్తమైనవెనుక మరల దానిని సాధింపనేరక