పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయతరంగము

173

రాయచరిత్రమునకుఁ గృతిభర్త యీవంశోద్భవుఁడే. నరసారావుపేట నరసారాయణుంగారిపేరఁ గట్టింపఁబడినది. కావుననే గ్రామమున కాపేరే పెట్టఁబడినది. వీరియాస్థానకవి రాళ్ళపల్లి పట్టాభిరామరాజను నొకబట్టు. సంస్థానాధిపతులనుగుఱించిన చాటువులు—

చ. “హరుఁ డనుకొంటిమా విషధరాభరణంబు ధరించుటేది? శ్రీ
   హరి యనుకొంటిమా ఫణికృతాంతకవాహన మేది? వాఙ్మనో
   హరుఁ డనుకొంటిమా సరసిజాసన మే”దని ధీరు లెంతు రీ
   స్థిరతర మల్లరాడ్కులనృసింహుని వేంకటవారసింహునిన్.

మ. బలభిద్వైభవభీమరేఖ విలసద్భాహాబలప్రౌఢి కుం
   డలిరాడ్పాండితి యక్షరాడ్తనుజసౌందర్యంబు దుర్గాధిప
   త్యలఘుస్థేమము జానకీపతిసుదానాసక్తి మీ కిచ్చుఁ గా
   కలరన్ శ్రీమలరాజవేంకటనృసింహా! రాజకంఠీరవా!

ఉ. తోయజగంధిచుక్క లని తోఁచు ఖభిత్తిక నున్న వేమి? యే
   మో యని సంశయింపకుము ముద్దులగుమ్మ! సురాంగనామణుల్
   వ్రాయఁగ లేక యిందు మలరాడ్కులవేంకటనారసింహభూ
   నాయకచంద్రునింటఁ గలనాకము లెన్నఁగఁ జిత్రవైఖరిన్.

శా. శ్రీమన్మంగళదేవతాహృదయరాజీవద్విరేఫంబు శ్రీ
   రామబ్రహ్మము పుత్రపౌత్రబలదీర్ఘాయుస్థిరాభోగసు
   త్రామైశ్వర్యముఖాదిసద్విభవ మశ్రాంతంబు మీ కీవుతన్
   హేమల్రాజకులీన! వేంకటనృసింహేంద్రా! కవీంద్రస్తుతా!

ఉ. కంతుఁడొ! యిందిరారమణికాంతుఁడొ! చారుసరస్వతీసతీ
   కాంతుఁడొ! శ్రీజగజ్జననికాంతుఁడొ! పుణ్యవసంతుఁడో! శచీ
   కాంతుఁడొ! యంచుఁ బండితులు గాంచి హృదబ్జములందు మించి యో
   జింతురు మల్లరాడ్కులనృసింహుని వేంకటనారసింహునిన్.